Sweet Corn Omelette: గుడ్డుతో వెరైటీ స్నాక్స్ రెసిపీ .. స్వీట్ కార్న్ , క్యారెట్ తో ఆమ్లెట్ తయారీ విధానం

Sweet Corn Omelette: పోషకాహారం గుడ్డు. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది. ఎన్నో పోషకాలున్న గుడ్డుని ఆహారంలో భాగంగా కూరలు, బిర్యానీ వంటివి చేసుకుంటాం..

Sweet Corn Omelette: గుడ్డుతో వెరైటీ స్నాక్స్ రెసిపీ .. స్వీట్ కార్న్ , క్యారెట్ తో ఆమ్లెట్ తయారీ విధానం
Sweet Corn Omelette
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 17, 2021 | 1:46 PM

Sweet Corn Omelette: పోషకాహారం గుడ్డు. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది. ఎన్నో పోషకాలున్న గుడ్డుని ఆహారంలో భాగంగా కూరలు, బిర్యానీ వంటివి చేసుకుంటాం.. ఇక ఆమ్లెట్ గా కూడా వేసుకుని తింటాం.. అయితే ఆమ్లెట్ ను కూడా చాలా రకాలుగా వేసుకోవచ్చు. టమాటా ఆమ్లెట్, స్వీట్ కార్న్ ఆమ్లెట్, బ్రేడ్ ఆమ్లెట్ ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు స్వీట్ కార్న్ వెజిటబుల్ ఆమ్లెట్ తయారీ విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు :

గుడ్లు-2 క్యారెట్ తురుముకోవాలి స్వీట్ కార్న్ ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కొత్తిమీర కట్ చేసింది. ఉప్పు రుచికి సరిపడా నూనె పసుపు కొంచెం

స్వీట్ కార్న్ ఆమ్లెట్ తయారీ విధానం :

ముందుగా స్వీట్ కార్న్ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకుని తురుముకున్న క్యారెట్ ను వేసుకుని వేయించుకోవాలి. వేగిన అనంతరం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్, ఉప్పు ,కొత్తిమీర తరుగు వేసుకుని మరికొంచెం సేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని స్టౌ మీద దింపేసి.. స్టౌ మీద పెనం పెట్టి.. రెండు గుడ్లను ఒక గిన్నెలోకి కొట్టుకుని..దానిని బాగా గిలకొట్టాలి. పెనం మీద నూనె వేసి.. అలా మిక్స్ చేసిన గుడ్డుని ఆమ్లెట్ లా వేసుకుని కొంచెం సేపు కాలనివ్వాలి. అలా కాలనిచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఆ ఆమ్లెట్ మీద వేసుకుని.. ఆమ్లెట్ కాలిన అనంతరం రెండో వైపు తిప్పకుండా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. సర్వ్ చేసుకునే ప్లేట్ లో ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు పెట్టుకుని ఇష్టమైన వారు వీటితో కలిపి తింటే ఈ స్వీట్ కార్న్ ఆమ్లెట్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.

Also Read: కాళ్లకు చెప్పులు, షూ లేకుండా ఉత్త కాళ్లతో నడిచే నడక ఆరోగ్యానికి మంచిది.. ఎందుకంటే

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు