Walking Barefoot:  కాళ్లకు చెప్పులు, షూ లేకుండా ఉత్త కాళ్లతో నడిచే నడక ఆరోగ్యానికి మంచిది.. ఎందుకంటే

Walking Barefoot: శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి వ్యాయామం తప్పని సరి.. అయితే వ్యాయామంలో నడక చాలా మంచిది. నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది...

Walking Barefoot:  కాళ్లకు చెప్పులు, షూ లేకుండా ఉత్త కాళ్లతో నడిచే నడక ఆరోగ్యానికి మంచిది.. ఎందుకంటే
Walking Barefoot
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 17, 2021 | 1:15 PM

Walking Barefoot: శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి వ్యాయామం తప్పని సరి.. అయితే వ్యాయామంలో నడక చాలా మంచిది. నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ నడక వీలైనంత చురుగ్గా.. శరీరం మొత్తం కదిలేలా నడిస్తే మంచి ఫలితం ఉంటుంది. వేగంగా నడవడం వల్లన ఊపిరి పీల్చుకునే విధానంలో వేగం పెరుగుతుంది. ఊపిరితిత్తులు, గుండెపనితీరు మెరుగుపడుతుంది. అయితే ఈ నడక చెప్పులను షూ వేసుకుని చేస్తున్నారు. అయితే వ్యాయామంలో భాగంగా నడిచే నడకకు చెప్పు లేకుండా ఉత్త పదాలతో చేయడం మంచిదట. చెప్పులు లేకుండా ఉట్టపాదాలతో నడిచే నడకతో అనేక ప్రయోజాలున్నాయట.

ఉత్త పాదాలతో నడిస్తే.. నడక స్థిరంగా ఉంటుందట. శరీర భంగిమ సరిగ్గా ఉండి.. శరీరాన్ని బేలెన్స్ చేసుకోగలుగుతారట.. అందుకనే వ్యాయామం గా నడిచే సమయంలోనే కాదు.. ఇంట్లోనూ , ఆఫీసులోనూ ఆరుబయట హ్యాపీగా చెప్పులేకుండా తిరగమని న్యూయార్కులోని ఇథాకా స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యూమన పెర్ఫామెన్సకు చెందిన ప్రొఫెసర్‌ పాట్రిక్‌ మెక్‌కెన చెబుతున్నారు.

చెప్పులేకుండా నడిచే నడక వలన మన కదలికలపై ప్రభావం చూపిస్తుంది. పాదాల్లోని కండరాలను స్థిరంగా ఉండేట్టు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు.. ఈ నడక పొత్తి కడుపులోని కండరాలపై ప్రభావం చూపుతుంది.

కాళ్లలోని, పాదాల్లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. వీటి గురించి న్యూరల్‌ కనెక్షన ద్వారా మెదడుకు సమాచారం చేరుతుంది. ఈ కనెక్షన్ దెబ్బతింటే గాయాల బారినపడే అవకాశం ఉంది. ముఖ్యంగా షూస్, చెప్పులు వేసుకుని నడిచే నడకతో.. అప్పుడప్పుడు పాదాల కండరాల మధ్య ఉండే సహజసిద్ధమైన లింకు దెబ్బతింటుంది. షూ కింద ఉండే బిగ్‌ సోల్‌ వల్ల పాదాల సహజసిద్ధమైన సమతులత దెబ్బతింటుందని ప్రొఫెసర్‌ పాట్రిక్‌ చెప్పారు. ఇలా కండరాలు పనిచేయక పోతే.. లిగ్మెంట్స్‌ మీద, ఎముకల మీద, టెన్డెన్స్ పై ప్రభావం పడుతుంది. అప్పుడు కండరాలు గాయపబారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుల్లనే కండరాలు దృఢంగా పనిచేయాలంటే.. చెప్పులేకుండా నడవాలని.. ఇలా చేస్తే.. కాళ్లలోని కండరాలు బలపడతాయని చెప్పారు.

అయితే నడక చెప్పులేకుండా చేయమన్నారు కదా అని .. శీతాకాలంలో కూడా షూస్, చెప్పులు లేకుండా నడవడం కానీ.. పరిగెత్తడం కానీ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.. మిగిలిన సమయంలో నడక నడిచే సమయంలో ఉత్తకాళ్లతో నడవం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Also Read: వైజాగ్, అరకు సందర్శించాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.