AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itchy Eyes Remedies: సెల్, ల్యాప్‌టాప్‌లు ఎక్కువ యూజ్ చేస్తున్నారా.. కళ్ళకు ఉపశమనం కోసం ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం

Itchy Eyes Remedies: ప్రస్తుతం వాతావరంలో మార్పులు.. సెల్, ల్యాప్ టాప్ ల వినియోగం ఇవన్నీ కలిసి మనిషి కంటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. కొంత మంది కళ్ళ పై వాతావరణ కాలుష్యం..

Itchy Eyes Remedies: సెల్, ల్యాప్‌టాప్‌లు ఎక్కువ యూజ్ చేస్తున్నారా.. కళ్ళకు ఉపశమనం కోసం ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం
Itchy Eyes
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 17, 2021 | 3:40 PM

Share

Itchy Eyes Remedies: ప్రస్తుతం వాతావరంలో మార్పులు.. సెల్, ల్యాప్ టాప్ ల వినియోగం ఇవన్నీ కలిసి మనిషి కంటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. కొంత మంది కళ్ళ పై వాతావరణ కాలుష్యం తీవ్ర ప్రభావం పడి దురదలు, వాపు వాస్తు ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం వంటింట్లో ఉండే వస్తువులతో సింపుల్ చిట్కాలను పాటించి చుడండి.. తరచుగా కళ్ళకు వచ్చే వాపూ, దురదల నుంచి బయటపడండి.

* కీరదోస వేసవి దాహార్తిని తీరుస్తుందని అందరికీ తెలుసు.. అయితే కీరదోస కళ్ళు పడే శ్రమనుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. కీరదోస ముక్కల్ని సన్నగా తరిగి గుజ్జులా చేసుకుని.. ఆ గుజ్జుని కొంచెం సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత ఆ గుజ్జుని కళ్ళ మీద అప్లై చేసుకోవాలి.. అనంతరం ఒక 15 నుంచి 20నిముషాలు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఇలా రోజులో నాలుగు నుంచి ఐదు సార్లు చేస్తే.. కళ్ళు దురదలనుంచి ఉపశమనం లభిస్తుంది. *కళ్ళల్లో దుమ్ము పడిన ఫీలింగ్ ఇబ్బంది పెడుతుంటే.. కాసిన పాలను ఫ్రిజ్ లో పెట్టి.. ఆ పాలల్లో దూది ఉండలు వేసుకుని .. వాటిని కళ్లపై సున్నితంగా అడ్డుకోవాలి. ఇలా చేస్తే..కళ్ళకు కలిగిన అలసట తగ్గుతుంది. దురదలనుంచి ఉపశమనం లభిస్తుంది. కళ్ళలోని దుమ్ముధూళి బయటకు వచ్చేస్తుంది. * కొన్ని గులాబీ రెక్కలను శుభ్రమైన నీటిలో వేసుకుని కొంచెం సేపటి తర్వాత ఆ నీటిలో దూదిని ముంచు ఆ ఉండలను కళ్ళమీద పెట్టుకోవాలి.. తర్వాత కళ్లపై మునివేళ్లతో సున్నితంగా రబ్ చేయాలి.. ఇలా చేస్తే.. కళ్ళ మంట,నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. , *కంటి వాపు, దురదలు ఉన్నవారు చల్లటి గ్రీన్ తో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. గ్రీన్‌టీ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కంటి వాపు, దురద వంటివి తగ్గుతాయి. సుఖ నిద్ర పడుతుంది. • కళ్ళు పొడిబారినట్లు ఉంటె.. కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి కళ్లలోకి వెళ్లకుండా.. రెప్పల మీద మృదువుగా రాయాలి. పొడిబారిన కళ్లకు తేమ అందుతుంది. కళ్లకి సంబంధించి ఇతర సమస్యలను తగ్గిస్తుంది.

Also Read: Inspiring Story: కొడుకు మరణం.. పిల్లల్ని వదిలేసిన తల్లి.. మనవళ్ల చదువుకోసం 100 ఏళ్ల తాత కష్టం.. కన్నీటి మయం