Tips For Common Cold: జలుబు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

Tips For Common Cold: జలుబు, పడిసం , రొంప ఇలా ఏ పేరుతో పిలిచినా ఇది.. శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ ఏకాట్ చేయడం వలన కలిగే జబ్బు. ఈ వ్యాధి ముక్కు, గొంతు, స్వరపేటికను..

Tips For Common Cold:  జలుబు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి
Common Cold Tips
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 17, 2021 | 12:00 PM

Tips For Common Cold: జలుబు, పడిసం , రొంప ఇలా ఏ పేరుతో పిలిచినా ఇది.. శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ ఏకాట్ చేయడం వలన కలిగే జబ్బు. ఈ వ్యాధి ముక్కు, గొంతు, స్వరపేటికను ప్రభావితం చేస్తుంది. జలుబు మొదలైతే.. కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతు రాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఒకటి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపించే వ్యాధి. జలుబుకు ఎలాంటి టీకా (వ్యాక్సీన్) లేదు. నివారణకు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడమే..నిజానికి జలుబు చేస్తే మంచిదే ఎందుకంటే ఒంట్లో వేడి తగ్గుతుంది. అదే జలుబు ఎక్కువ రోజులుంటే.. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ. నొప్పులు ఆ పైన జ్వరం. ఈరోజు జలుబు తగ్గడానికి ఇంట్లో పాటించే సింపుల్ చిట్కాలను గురించి తెలుసుకుందాం.. *జలుబుతో బాధ పడుతూ.. ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతుంటే.. మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని తీసుకోండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గి జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది . *జాజి కాయ, అల్లం, కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని వేడి చేసుకుని .. గోరు వెచ్చగా ఉన్న తర్వాత తాగితే.. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. *జలుబుతో బాధపడుతూ.. వెంటనే రిలీజ్ కావాలనుకునేవారు ఎనిమిది మిరియాలను నెయ్యిలో వేయించుకుని వాటిని తినాలి. తర్వాత గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గు ముఖం పడుతుంది. *లవంగాలు, తమలపాకు రసం, అల్లం రసాన్ని తేనె తో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు తగ్గుతుంది. *కఫంతో కూడిన జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మిరియాలను వేయించి పొడి చేసుకుని అర టీ స్పూన్ చొప్పున మూడు నాలుగు రోజుల పాటు ఉదయాన్నే తీసుకోవాలి. *జలుబుతో ముక్కు కారుతుంటే.. కొంచెం చింతపండు గుజ్జు , టమోట రసం, మిరియాల పొడి, ఒక ఎండు మిరప కాయ, కొంచెం ఉప్పు లతో వేసుకుని సుప్ లా తయారు చేసుకుని .. వేడి వేడిగా తాగితే సూప్ ని వేడిగా తాగితే జలుబు ముక్కు కారటం తగ్గుతుంది. అసలు జలుబు సోకకుండా ఉండడానికి ప్రతి రోజూ నీటిని బాగా మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగితే మంచిది.

Also Read: TGWDEW Recruitment 2021: 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహితులు గుడ్ న్యూస్.. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!