BP Diabetes: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? అదుపులో ఉంచుకోవాలంటే ఇవి పాటించాలంటున్న వైద్య నిపుణులు

BP Diabetes: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి, సరైన వ్యాయమం లేకపోవడం తదితర కారణాల..

BP Diabetes: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? అదుపులో ఉంచుకోవాలంటే ఇవి పాటించాలంటున్న వైద్య నిపుణులు
Bp Diabetes
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 17, 2021 | 12:49 PM

BP Diabetes: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి, సరైన వ్యాయమం లేకపోవడం తదితర కారణాల వల్ల మానవుడు జబ్బుల బారిన పడుతున్నారు. ఇక ఎక్కువగా బీపీ, షుగర్‌లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. గతంలో పట్టణాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ జబ్బులు.. ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. డయాబెటిస్‌, బీపీ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి నలుగురిలో ఒకరిని బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్‌ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్‌ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే భారీ స్థాయిలో బీపీ, షుగర్‌ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక గుండె జబ్బుల బారిన పడుతున్నారని నిపుణులు వివరిస్తున్నారు.

వ్యాయామం లేకే ..

ఎంతో మంది ప్రతి రోజు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతుంటారు. దీని కారణంగా కూడా జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారమూ తీసుకోవడం, పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రభావానికి లోనవుతుండటం వివిధ జబ్బులతో అనారోగ్యం బారిన పడుతున్నారు. పిల్లలకు క్రీడల వైపు మొగ్గు చూపడం, పెద్దవాళ్లు యోగా చేయడం లాంటివి చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. షుగర్‌ ఉన్నవారు డైట్ లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి. పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అన్నది తప్పు అభిప్రాయం. వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాలలోనూ 70 శాతం పిండి పదార్థం ఉంటుంది. అందుకే ఏ ధాన్యం తినాలన్నది ముఖ్యంకాదు. ఎంత పరిమాణంలో తింటున్నం అన్నదే ముఖ్యం.

ఇక రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు వైద్యులు. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం అధికంగా ఉంటుంది. సుమారు 600 మిల్లీలీటర్ల కొబ్బరినీరుతో 1,500 మి.గ్రా. పొటాషియం లభిస్తుంది. సోడియం, పొటాషియం సమతౌల్యం కోసం శుద్ధి చేయని నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు వాడాలి. తెల్లని ఐయోడైజ్డ్‌ ఉప్పులో సోడియం మాత్రమే ఉంటుంది. ఆ ఉప్పులో పొటాషియం ఉండదు. బాగా వేగించిన ఆహారపదార్ధాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ పోషకాలను గ్రహించనీయవు. ఈ ఫుడ్స్‌ సోడియం, పొటాషియం శాతాన్ని, నీటి శాతాన్ని మారుస్తాయి. దీని ఫలితంగా రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయి.

ఇంటి వద్ద తయారుచేసుకున్న పచ్చళ్లలో ఉండే ఆరోగ్యకర బ్యాక్టీరియా రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. అలాగే రకరకాల చిరు, పప్పు ధాన్యాలతో తయారైన పాపడ్స్‌లోని నల్ల మిరియాలు, జీలకర్ర ఆరోగ్యానికి మంచి చేస్తాయి. రక్తపోటు అదుపులో ఉంటే చాలా అనారోగ్యాలు దరిచేరవు. సరిపోను నిద్ర, విశ్రాంతి శరీరానికి చాలా అవసరం. రోజూ కాసేపు నడవడం వల్ల రక్తపోటు సాధరణంగా ఉంటుంది. కార్డియో, యోగ వంటి వ్యాయామాలు దీర్ఘకాలికంగా రక్తపోటును నియంత్రిస్తాయి.

ఇవీ కూడా చదవండి

Dragon Fruit Benefits: డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి మీకు తెలుసా..? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్టరు..!

Menstrual Health: మహిళలు రుతుక్రమం సమయంలో చేసే తప్పులు ఇవే.. ఈ సూచనలు పాటించాలంటున్న వైద్యులు

Monsoon Diet: వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..