Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Diet: వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Rainy Season: వర్షాకాలం ప్రారంభం కాగానే చాలామంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వర్షాకాలం రాగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి..

Monsoon Diet: వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 15, 2021 | 6:14 PM

Monsoon Diet: వర్షాకాలం ప్రారంభం కాగానే చాలామంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వర్షాకాలం రాగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాగానే జ్వరం, దగ్గు, జలుబు, వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాకాలంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాం.

► వానా కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. ప్రధానంగా బయటి ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకుంటే పలు ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో బజ్జీలు, పకోడీలు వంటి ఆహార పదార్ధాలను తినడానికి ఎక్కవగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ విధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకుంటే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అదేవిధంగా వర్షాకాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ విధంగా ఇన్ఫెక్షన్ సోకిన ఆకుకూరలను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.

► వర్షా కాలంలో హెర్బల్ టీ లేదా కషాయాలను తాగ‌డం ద్వారా మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుప‌డుతుంది. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.

► ప్రతి సీజన్‌లో అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సీడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

► నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న ‘విటమిన్ సీ’ అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి. అంతేకాకుండా నిమ్మకాయతో రోగనిరోధక శక్తి కూడా అమితంగా పెరుగుతుంది.

► వర్షాకాలంలో సలాడ్లు, ఐస్‌క్రీమ్‌లను తీసుకోకపోవడం మంచిదంటున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల నీటి ద్వారా చాలా రకాల ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది.

► అలాగే మన ఇంటి ఆవరణ చుట్టూ ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి ఆవరణ చుట్టూ ఎక్కడ నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా ఆపవచ్చు.

► వర్షాకాలంలో చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారపదార్థాలను తీసుకోవడం మానేయాలి. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల చేపలు రొయ్యలను తీసుకోవడంతో ఆ ప్రభావం మనపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Diabetes: డయాబెటిస్‌ ఉన్న వారు కోడి గుడ్లు తినొచ్చా..? సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు

Monsoon Food Recipes: ఈ వర్షంలో సాయంత్రపు వేళ చాయ్‏తో ఈ రుచికరమైన స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయండి..

బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..