Health Benefits of Peanuts: అధిక బరువుతో బాధపడుతున్నారా..? వేరుశనగల్ని ఇలా తిని చూడండి..!
మనలో చాలా మంది పల్లీలను చాలా ఇష్టంగా తింటాం. అవి పచ్చివైనా, వేయించినవైనా, ఉడకబెట్టినవైనా ఇలా ఏ రూపంలోనైనా అమితంగా తింటుంటాం.
Health Benefits of Peanuts: మనలో చాలా మంది పల్లీలను చాలా ఇష్టంగా తింటాం. అవి పచ్చివైనా, వేయించినవైనా, ఉడకబెట్టినవైనా ఇలా ఏ రూపంలోనైనా అమితంగా తింటుంటాం. పల్లీలలో విటమిన్ ఇ, సెలీనియం, ఫైబర్, జింక్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన శరీర అందానికి కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. అలాగే రక్త ప్రసరణను పెంచడంలోనూ ఉపయోగపడతాయి. అయితే, మనలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. తొక్కతో తినాల్సిన వాటిని తొక్కతో తినకుండా వదిలేస్తుంటాం. అలాగే పొట్టుతో ఉన్నవాటిని కూడా ఇలానే తీసిపారేస్తుంటాం. పల్లీలను కూడా కొంతమంది ఇలానే పొట్టు తీసి తింటుంటారు. అది చాలా తప్పని అంటున్నారు నిపుణులు. పల్లీలపై ఉండే పొట్టు మన నోటికి కాస్త చేదుగా ఉంటుందని తినడం మానేస్తుంటారు. అలా పొట్టను పారేయడం వల్ల చాలా ఉపయోగాలను పొందలేరని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
వేరుశనగ గింజల పొట్టులో బయోయాక్టివ్స్, ఫైబర్ లాంటివి రోగాలు రాకుండా కాపాడతాయంట. పొట్టులో ఉండే పాలీఫెనాల్ మనశరీరంలో కలిసిపోయి చర్మాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మం ఎండిపోకుండా కాపాడుతుంది. గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే గుణాలు కూడా ఉంటాయంట. బ్లూబెర్రీ పండ్లలో కంటే వేయించిన వేరుశనగ పొట్టులో విష వ్యర్థాల్ని తొలగించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో నిరూపణ అయింది. ఎండిన పొట్టులో కంటే వేయించిన పొట్టులోనే ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. విటమిన్ సీ, గ్రీన్ టీ కంటే కూడా వేయించిన వేరు శనగ గింజల్లో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే వేరశనగ పొట్టులో ఉండే ఫైబర్.. శరీర అధిక బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతోంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అందుకే పల్లీలను పొట్టుతో తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
ద్రాక్షపండ్లు, వైన్‌లో ఉండే రెస్వెరాట్రాల్.. పల్లీల పొట్టులో కూడా ఉంటుందంట. ఇది మనలో సహనాన్ని పెంచేందుకు సహాయపడుతోందంట. శరీరంలో మంట, వాపు, దురదల్లాంటి వాటిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతంది. అలాగే గుండె జబ్బుల్ని అడ్డుకునేందుకు కీలక పాత్ర పోషించనుంది. కాగా, రెస్వెరాట్రాల్ ఎక్కువగా కావాలంటే మాత్రం ఉడకబెట్టిన వేరుశనగ గింజల్ని పొట్టుతో సహా తినాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఓ గుప్పెడు పల్లీలు పొట్టుతో సహా తింటే మన ఆరోగ్యంలో వచ్చే మార్పులు చాలా ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సో పొట్టుతో పల్లీలు తింటే వచ్చే లాభాలు తెలిసాయిగా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. తినేయండి మరి.
Also Read:
Monsoon Diet: వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Monsoon Food Recipes: ఈ వర్షంలో సాయంత్రపు వేళ చాయ్‌తో ఈ రుచికరమైన స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయండి..