AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Food Recipes: ఈ వర్షంలో సాయంత్రపు వేళ చాయ్‏తో ఈ రుచికరమైన స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయండి..

గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. రోజంతా సూర్యుడు కనిపించకుండా మాయమైపోతున్నాడు.

Monsoon Food Recipes: ఈ వర్షంలో సాయంత్రపు వేళ చాయ్‏తో ఈ రుచికరమైన స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయండి..
Monsoon Snacks
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 15, 2021 | 5:40 PM

Share

గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. రోజంతా సూర్యుడు కనిపించకుండా మాయమైపోతున్నాడు. ఎప్పుడూ ఏ సమయంలో వర్షం పడుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ వర్షంలో వేడి వేడిగా ఉండే ఆహారం.. స్నాక్స్ తీనాలిపిస్తుంది చాలా మందికి. కానీ ప్రస్తుత పరిస్థితులలో వీధులలో లభించే ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి. లేదంటే.. టైఫాయిడ్, ఫ్లూ, జ్వరం, జలుబు, కడపు సమస్యలు వేధిస్తాయి. అలా కాకుండా.. మీ ఇంట్లోనే ఈ రుచికరమైన స్నాక్స్ రెడీ చేసి.. సాయంత్రపు చాయ్ వేళను ఎంజాయ్ చేయండి. అవెంటో తెలుసుకుందామా.

1

1. కోతింబీర్ వాడి.. వినడానికి కొత్తగా ఉంది కదూ.. అవును ఈ స్నాక్స్‏ను ఎక్కువగా మాహారాష్ట్రలో తయారు చేస్తారు. కొత్తిమీరను మరాఠీలో కోతింబిర్ అంటారు. శనగపిండి, కొత్తిమీర, వేరుశెనగ, నువ్వులు, సుగంద ద్రవ్యాలతో వీటిని తయారు చేస్తారు. వీటిని వర్షంలో సాయంత్రం సమయంలో టీతోపాటు తింటూ ఎంజాయ్ చేయ్యొచ్చు.

2

2. గ్రీన్ పచ్చడితో పియాజ్ పకోడి.. వర్షాకాలంలో ఇది సరైన స్నాక్స్. శెనగ పిండి, తగినంత ఉప్పు, ఉల్లిపాయలతో వీటిని తయారు చేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగా తింటారు. వీటితోపాటు.. రెడ్/ గ్రీన్ మిరపకాయ వెల్లుల్లి పచ్చడిని జోడిస్తే టెస్ట్ అదుర్స్.

3

3. బెల్పూరి.. బెల్పూరి.. సాధారణంగా అందరికి తెలిసిన వంటకమే. క్షణాల్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు. కాస్త కారం, తీపి కలగలిసినట్టుగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఇష్టంగా ఈ స్నాక్ తినడానికి ఇష్టపడుతుంటారు.

4

4. మూంగ్ దాల్ సమోసా.. సమోసాలు.. సాధారణంగా అందరూ ఇష్టపడే స్నాక్. ఇందులో అనేక రకాలు ఉంటాయి. అయితే వర్షాకాలంలో రుచితోపాటు.. ఆరోగ్యానికి మేలు కల్పించే సమోసాలలో మూంగ్ దాల్ సమోసా ఒకటి.. దీనిని సరైన పచ్చడితో తీసుకోవడం మంచిది.

5

5. గుజరాతీ మసాలా కచోరి.. మసాలా కచోరిని ఎక్కువగా గుజరాతీలు చేసుకుంటారు. శెనగ పిండి, కొబ్బరి, లవంగం పొడి, దాల్చిన చెక్క పొడి, వేరు శెనగ, జీలకర్ర, యాలకులు కలిసి వీటిని తయారు చేస్తారు. వీటికి మరింత రుచి రావాలంటే.. డీప్ ఫ్రై చేసుకోవాలి.

6

6. వేయించిన ఉల్లిపాయ రింగులు.. సాధారణంగా చాలావరకు ఉల్లిపాయ పకోడీలు చేసుకుంటారు. కానీ ఈ వర్షాకాలంలో సరికొత్తగా ఉల్లిపాయ రింగులను ట్రై చేయండి. ఇందుకు తక్కువ మొత్తంలో వస్తువులు ఉపయోగపడతాయి. ఈ ఉల్లిపాయ రింగులను పుదీనా పచ్చడితో తీసుకుంటే.. మళ్లీ మళ్లీ తినకుండా ఉండలేరు.

Maggi

7. మసాల మాగీ.. మాగీ.. పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఇష్టపడే వంటకం. దీనిని రెడీ చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. అయితే వర్షంలో మాగీని తినాలనుకుంటే మాత్రం మాసాల మాగీ సరైనది.

Also Read: Faria Abdullah: డ్యాన్స్‏తో అదరగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. చిట్టి ఆటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

R Narayana Murthy: ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానంటా.. ఆ వార్తలు బాధ కలిగించాయి.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్..