Faria Abdullah: డ్యాన్స్‏తో అదరగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. చిట్టి ఆటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

"జాతిరత్నాలు" సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైన ఫరియా అబ్ధుల్లా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకుంది.

Faria Abdullah: డ్యాన్స్‏తో అదరగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. చిట్టి ఆటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
Faria Abdullah
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 15, 2021 | 4:43 PM

“జాతిరత్నాలు” సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైన ఫరియా అబ్ధుల్లా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో చిట్టి పాత్రలో ఫరియా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్ధుల్లా తమ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమాతోనే తెలుగులు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ హైదరాబాద్ చిన్నది. ఇక ప్రస్తుతం ఫరియాకు తెలుగులో ఆఫర్లు తక్కువగానే ఉన్నాయి. ఇటీవల మంచు విష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న డీ సిక్వెల్‏లో ఫరియా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక చేతిలో సినిమాలు లేకపోయినా.. ఫరియా మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటూ.. అభిమానులకు టచ్‏లో ఉంటుంది. ఎప్పటికప్పుడూ.. తన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తుంది చిట్టి. ఇక ఇటీవల డ్యాన్స్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ.. తన డ్యాన్స్ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ వచ్చింది. తాజాగా ఫరియాకు సంబంధించిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సారి మరింత నాజూకు అవతారంలో… ఫర్ఫెక్ట్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అందరి చేత వావ్‌ అనిపిస్తున్నారు ఫరియా..! వావ్‌ అని అనిపించడమే కాదు… ఈ డ్యాన్సింగ్ వీడియోతో నెట్టింట వైరల్ అవతున్నారు.ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా మరో క్రేజ్‌ను సొంతం చేసుకుంది ఈ భామ. ఈ కారణంగానే ఆమె క్రేజీ ఆఫర్లను రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్‌ ఆమెకంటే చాలా తక్కువట. ఇక ఫరియా బాలీవుడ్‏లోనూ ఛాన్స్‏లో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వీడియో..