Sammathame Movie: హీరో కిరణ్ అబ్బవరంను చూస్తూ ఉండిపోయిన చాందీని.. ఆకట్టుకుంటున్న “సమ్మతమే” ఫస్ట్‌లుక్ పోస్టర్..
సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. గుర్తింపు తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు.. అంతేకాకుండా.. చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించి.
సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. గుర్తింపు తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు.. అంతేకాకుండా.. చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించి.. వరుస అవకాశాలను అందుకోవడం ఒక ఎత్తు అయితే.. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. హీరోగా రాణించడం మరో ఎత్తు. అందులో న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోవడమే కాకుండా.. స్టార్ డమ్ సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. రాజవారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చేశాడు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటించింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదల చేయనున్నారు. అటు ఈ మూవీ చేస్తూనే.. మరో మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు ఈ యంగ్ హీరో.
తాజాగా కిరణ్ నటిస్తున్న సమ్మతమే సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. కలర్ ఫోటో ఫేమ్ చాందీని చౌదరీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా తెలుస్తోంది. ఇందులో కిరణ్ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కనిపిస్తుండగా.. అతన్ని చూస్తూ ఎఫెక్షన్ ఫీల్ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రవీణ నిర్మిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్వీట్..
Krishna ❤️#Sammathame #ugproductions pic.twitter.com/0Q3qFWELig
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 15, 2021
Also Read: Faria Abdullah: డ్యాన్స్‌తో అదరగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. చిట్టి ఆటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..