AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evaru Meelo Koteeswarulu: “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో మొదట వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా.. తారక్ ముందుగా ప్రశ్నించేది ఆ స్టార్‏నే అంటా..

వెండితెరపై టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్.. బిగ్‏బాస్ షోతో బుల్లితెరపై కూడా కింగ్ అనిపించుకున్నారు. షో నిర్వహించడంలో తనదైన

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మొదట వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా.. తారక్ ముందుగా ప్రశ్నించేది ఆ స్టార్‏నే అంటా..
Evaru Meelo Koteeswarulu
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 15, 2021 | 8:09 PM

Share

వెండితెరపై టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్.. బిగ్‏బాస్ షోతో బుల్లితెరపై కూడా కింగ్ అనిపించుకున్నారు. షో నిర్వహించడంలో తనదైన స్టైల్‏ను క్రియేట్ చేశారు ఎన్టీఆర్. ఇక ఆ తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు తారక్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెర పై కనివిందు చేయనున్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటిశ్వరులు అనే షోతో మరికొద్ది రోజుల్లో యంగ్ టైగర్ బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వస్తుంది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. తాజాగా తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ రాబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు నిర్వహకులు. తాజాగా ఈ షోకు మొదట వచ్చే గెస్ట్ వివరాలు లీకయ్యాయి.

కోటీశ్వరులు కావాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారి కలలను నిజం చేయాలనే ఉద్దేశ్యంతో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ నాగార్జున 2014లోనే బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అదే ఏడాది డిసెంబర్‌లోనే రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. 2015 నవంబర్‌లో మూడో సీజన్‌ను ప్రసారం చేశారు. ఈ మూడు సీజన్లకు అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ నాలుగు సీజన్లు మా టీవీలో ప్రసారం కాగా.. ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయే ఐదో సీజన్ మాత్రం జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మొదటి గెస్ట్‏గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారట. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఈ రెండు మూడు రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఆ వెంటనే ఈ ప్రోమోను విడుదల చేసి.. షోను గ్రాండ్‏గా ప్రారంభించబోతున్నట్లుగా టాక్. అయితే వెండితెరపై సందడి చేసేందుకు సిద్దమైన తారక్, చరణ్‏లు అంతకంటే ముందే బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరిద్దరూ రాజమౌళీ దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్..

Also Read: Sammathame Movie: హీరో కిరణ్ అబ్బవరంను చూస్తూ ఉండిపోయిన చాందీని.. ఆకట్టుకుంటున్న “సమ్మతమే” ఫస్ట్‏లుక్ పోస్టర్‏..

R Narayana Murthy: ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానంటా.. ఆ వార్తలు బాధ కలిగించాయి.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్..

Kim Sharma: టెన్నిస్ ఆటగాడు లియాండర్ ఫేస్‏తో “ఖడ్గం” హీరోయిన్ ప్రేమాయణం.. స్పందించిన మాజీ ప్రియుడు..