Kim Sharma: టెన్నిస్ ఆటగాడు లియాండర్ ఫేస్‏తో “ఖడ్గం” హీరోయిన్ ప్రేమాయణం.. స్పందించిన మాజీ ప్రియుడు..

హీరోయిన్ కిమ్ శర్మ.. ఇండియన్ ఏస్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ ఫేస్‏తో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు,

Kim Sharma: టెన్నిస్ ఆటగాడు లియాండర్ ఫేస్‏తో ఖడ్గం హీరోయిన్ ప్రేమాయణం.. స్పందించిన మాజీ ప్రియుడు..
Kim Sharma
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 15, 2021 | 3:34 PM

హీరోయిన్ కిమ్ శర్మ.. ఇండియన్ ఏస్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ ఫేస్‏తో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో నిజాంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని బీటౌన్‏లో టాక్ నడుస్తోంది. కిమ్ శర్మ ప్రేమలో పడడం కొత్తేమి కాదు.. కెరీర్ ఆరంభంలోనే క్రికెటర్ యువరాజ్ సింగ్‏తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతోనూ కిమ్ శర్మ్ డేటింగ్ చేస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.

కిమ్ శర్మ గతంలో కెన్యాకు చెందిన వ్యాపారవేత్త కం డాన్ అలీ పుంజానీ వివాహం చేసుకుందని.. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారని ప్రచారమైంది. ఇక ఆ తర్వాత కిమ్.. తిరిగి బాలీవుడ్‏లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో యంగ్ హీరో హర్షవర్ధన్ రాణేతో ప్రేమలో పడింది. కిమ్ శర్మ.. తెలుగులో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రలలో నటించిన ఖడ్గం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హర్షవర్ధన్ రాణే.. భూమిక నిర్మించిన తకిట తకిట అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. కిమ్ – రాణే ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికే ఈ జంట విడిపోయింది.తాజాగా కిమ్.. టెన్నిస్ స్టార్ లియాండర్ ఫేస్‏తో ప్రేమలో పడినట్లుగా టాక్ బాలీవుడ్‏లో టాక్ నడుస్తోంది. అంతేకాదు.. వీరిద్దరు కలిసి ముంబైలో చాలాసార్లు జంటగా కనిపించారు. అయితే ప్రస్తుతం ఈ జంట గోవా బీచ్‏లో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో నిజాంగానే కిమ్ ప్రేమలో ఉన్నట్లుగా అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే.. కిమ్ శర్మ, లియాండర్ ఫేస్ ప్రేమాయణంపై ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ రాణే స్పందించాడు. కిమ్ శర్మ గురించి వస్తున్న వార్తలపై తనకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదని.. ఒకవేళ నిజాంగానే కిమ్ అతడితో ప్రేమలో ఉంటే మాత్రం.. నగరంలోనే వారిద్దరూ మంచి జోడి అని పేర్కోన్నాడు.

Also Read: Kiran Abbavaram: బ్యాక్‌గ్రౌండ్‌ లేదనే ఫీలింగ్‌ లేదు.. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను.. హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

Allu Arjun: అర్హ సినీ ఎంట్రీని కన్ఫామ్ చేసిన అల్లు అర్జున్.. ఆ స్టార్ హీరోయిన్ సినిమాలో బన్నీ డాటర్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?