Allu Arjun: అర్హ సినీ ఎంట్రీని కన్ఫామ్ చేసిన అల్లు అర్జున్.. ఆ స్టార్ హీరోయిన్ సినిమాలో బన్నీ డాటర్..

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. వెండితెర వైపు అడుగులు వేస్తుంది. ఈ విషయాన్ని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఇన్‏స్టా వేదికగా అభిమానులకు తెలియజేశారు.

Allu Arjun: అర్హ సినీ ఎంట్రీని కన్ఫామ్ చేసిన అల్లు అర్జున్.. ఆ స్టార్ హీరోయిన్ సినిమాలో బన్నీ డాటర్..
Allu Arha
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 16, 2021 | 12:06 PM

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. వెండితెర వైపు అడుగులు వేస్తుంది. ఈ విషయాన్ని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఇన్‏స్టా వేదికగా అభిమానులకు తెలియజేశారు. అక్కినేని సమంత… డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్‏లో వస్తున్న శాకుంతలం సినిమాతో అల్లు అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్‏గా అర్హ.. ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బన్నీ ఓ పోస్ట్ చేశారు. శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తోందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. గుణటీం వర్క్స్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరిలో ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇందులో దుశ్యంతుడి పాత్రలో మళయాలం స్టార్ దేవ్ మోహన్ నటించనున్నారు. ఇక ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్హ లిటిల్ భరతుడిగా కనిపించబోతుంది. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది. అల్లు రామలింగయ్య గారి మునివరాలు, అల్లు అరవింద్ గారి మనవరాలు, అల్లు అర్జున్ స్నేహల ముద్దులు కూతురు అర్హకు శాకుంతలం టీం స్వాగతం చెబుతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బన్నీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “శాకుంతలం సినిమాతో అల్లు వారి నాల్గో తరం కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఇది మేం గర్వించాల్సిన సమయం. గుణ శేఖర్, నీలిమ గుణలకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూతురిని పరిచయం చేయడమే కాకుండా నా కూతురిని కూడా గుణ శేఖర్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. నేను సమంతతోనూ నటించాను.. ఇక ఇప్పుడు నా కూతురు కూడా నటిస్తుండటం ఆనందంగా ఉంది. శాకుంతలం సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్” అని బన్నీ ట్వీట్ చేశారు.

ట్వీట్..

Also Read: Taapsee Pannu: జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టిన తాప్సీ.. తిరిగి ఇచ్చేయాలన్న ఉద్దేశంతోనే అంటూ..

RRR Movie: అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు జక్కన్న ఎంతలా కష్టపడ్డారో చూశారా? ఆకట్టుకుంటోన్న ఆర్.ఆర్‌.ఆర్‌ మేకింగ్‌ వీడియో.