Balakrishna on MAA: “మా” అధ్యక్ష ఎన్నికలపై హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో ఇప్పుడు నట సింహాం బాలకృష్ణ ఎంటర్ అయ్యాడు.
Nandamuri Balakrishna on MAA Elections: మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో ఇప్పుడు నట సింహాం బాలకృష్ణ ఎంటర్ అయ్యాడు. లోకల్ , నాన్ లోకల్ అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోనన్న నందమూరి బాలకృష్ణ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సంస్థ కోసం ఇంతవరకు బిల్డింగ్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో రాసుకొని, పూసుకొని తిరుగుతున్న సినీ పెద్దలు బల్డింగ్ కోసం ఓ ఎకరం భూమి సాధించలేరా? అని ప్రశ్నించారు. గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయంపై కూడా బాలయ్య ప్రస్తావించారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లిన చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయపన ప్రశ్నించారు. ఇండస్ట్రీ పెద్దలంతా బిల్డింగ్ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు బాలయ్య. అంతే కాదు బిల్డింగ్ కట్టే విషయంలో విష్ణు ముందుతాను ముందుంటానని చెప్పారు.