AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: బ్యాక్‌గ్రౌండ్‌ లేదనే ఫీలింగ్‌ లేదు.. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను.. హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాలంటే.. బ్యాక్‏గ్రౌండ్ ఉండి తీరాల్సిందే. అలాంటిదేమి లేకుండా.. తమ నటనతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటులు కొందరు మాత్రమే.

Kiran Abbavaram: బ్యాక్‌గ్రౌండ్‌ లేదనే ఫీలింగ్‌ లేదు.. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను.. హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..
Kiran Abbavaram
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2021 | 2:49 PM

Share

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాలంటే.. బ్యాక్‏గ్రౌండ్ ఉండి తీరాల్సిందే. అలాంటిదేమి లేకుండా.. తమ నటనతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటులు కొందరు మాత్రమే. అందులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకరు. “రాజావారు రాణిగారు” సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత యంగ్ హీరోకు సైలెంట్‏గానే వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే “ఎస్ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసిన కిరణ్.. ఆ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాకు శ్రీధర్ గాదె దర్శకత్వం అందించగా.. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మించగా.. ఆగస్టు 6న విడుదల కానుంది. గురువారం (జూలై 15న) తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చేశానన్నారు కిరణ్. ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని… ఓ తండ్రి, కొడుకుల కథే ఇదని కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ‘ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఖుషీ, పోకిరి’ వంటి చిత్రాలు చూసేటప్పుడు ప్రేక్షకుల్లో ఓ వైబ్రేషన్‌ ఉండేది.. అలాంటి వైబ్‌ స్ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నేనే రాశాను. నేను నటించిన ‘సెబాస్టియన్‌’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సమ్మతమే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ బ్యానర్‏లో ఓ సినిమా చేయనున్నాడు.

Also Read: Allu Arjun: అర్హ సినీ ఎంట్రీని కన్ఫామ్ చేసిన అల్లు అర్జున్.. ఆ స్టార్ హీరోయిన్ సినిమాలో బన్నీ డాటర్..

kodi ramakrishna: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న కోడి రామకృష్ణ కూతురు.. తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా..

Song Sequence In RRR: జక్కన్ననా మజాకా.. ఒక్క సాంగ్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేయనున్నారట..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు