AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kodi ramakrishna: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న కోడి రామకృష్ణ కూతురు.. తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా..

kodi ramakrishna: కోడి రామకృష్ణ పేరు తెలియని సగటు తెలుగు సీనీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి సందేహం ఉండదు. భక్తి ప్రధాన చిత్రాలకు తనదైన గ్రాఫిక్స్‌...

kodi ramakrishna: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న కోడి రామకృష్ణ కూతురు.. తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా..
Kodi Divya
Narender Vaitla
|

Updated on: Jul 15, 2021 | 2:18 PM

Share

kodi ramakrishna: కోడి రామకృష్ణ పేరు తెలియని సగటు తెలుగు సీనీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి సందేహం ఉండదు. భక్తి ప్రధాన చిత్రాలకు తనదైన గ్రాఫిక్స్‌ సొబగులు అద్ది ఆ కాలంలోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాకు దర్శకత్వం వహించి గొప్ప పేరు సంపాదించుకున్నారాయన. అరుంధతి సినిమాతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకర్షించారు కోడి రామకృష్ణ. ఇక ఈయన అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

అయితే తండ్రి దర్శకత్వంలో రాణిస్తే ఆయన కూతురు నిర్మాతగా కెరీర్‌ మొదలు పెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించి సినిమాలు చేయనున్నట్లు కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే తన తొలి సినిమాను సైతం ప్రకటించారు కూడా.’రాజా వారు రాణి గారు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాగా ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపంలో’ నటించిన కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న దీప్తి ఏమేర రాణిస్తారో చూడాలి.

Also Read: Song Sequence In RRR: జక్కన్ననా మజాకా.. ఒక్క సాంగ్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేయనున్నారట..

Taapsee Pannu: జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టిన తాప్సీ.. తిరిగి ఇచ్చేయాలన్న ఉద్దేశంతోనే అంటూ..

Megastar Chiranjeevi: అప్పట్లోనే దూరదర్శన్‌లో ప్రసారమైన ఓ సీరియల్‌లో నటించిన చిరు.. ఏ సీరియల్ అంటే..