AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టిన తాప్సీ.. తిరిగి ఇచ్చేయాలన్న ఉద్దేశంతోనే అంటూ..

Taapsee Pannu: 'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారారు. పేరుకు తెలుగు సినిమాతో...

Taapsee Pannu: జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టిన తాప్సీ.. తిరిగి ఇచ్చేయాలన్న ఉద్దేశంతోనే అంటూ..
Taapsee
TV9 Telugu Digital Desk
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 15, 2021 | 11:56 AM

Share

Taapsee Pannu: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారారు. పేరుకు తెలుగు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా బాలీవుడ్‌ సినిమాలతోనే తాప్సీ ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నటిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న తాప్సీ తాజాగా మరో కొత్త అవతారమెత్తడానికి సిద్ధమయ్యారు. ఇన్ని రోజులు సినిమాల్లో నటించిన తాప్సీ ఇకపై సినిమాలు తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ‘అవుట్‌ సైడర్‌ ఫిలింస్‌’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రంజల్‌ ఖాందియాతో కలిసి తాప్సీ సినిమాలు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తాప్సీ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా స్పందించారు.

గతేడాదితో తాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తయ్యాయని చెప్పుకొచ్చిన తాప్సీ. ఇన్నేళ్లలో తాను చాలా నేర్చుకున్నానని, తన ప్రయాణంలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని, అందుకే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల కోసం కచ్చితంగా మంచి కంటెంట్‌ను అందిస్తామని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే తాప్సీ ఈ ప్రొడక్షన్‌ హౌజ్‌కు ఈ పేరు పెట్టడానికి గల కారణంపై చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీకి చెందిన వారు కాకుండా కొత్త ట్యాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసేందుకే తాను ఈ పేరు పెట్టి ఉండొచ్చని ఓ వాదన వినిపిస్తోంది. ఇక ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రకటించిన కాసేపటికే తాప్సీ నిర్మాతగా తన తొలి సినిమాను ప్రకటించారు. అజయ్‌ భాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘బ్లర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్‌. ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించారు. మరి నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ అందాల తార నిర్మాతగా ఏమేర రాణిస్తుందో వేచి చూడాలి.

Also Read: RRR Movie: అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు జక్కన్న ఎంతలా కష్టపడ్డారో చూశారా? ఆకట్టుకుంటోన్న ఆర్.ఆర్‌.ఆర్‌ మేకింగ్‌ వీడియో.

Bandla Ganesh: మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్‌.. సాయం అడిగిన వెంటనే గూగుల్‌ పే నెంబర్‌ పంపమంటూ.

RAPO 19 Movie : రామ్ సినిమాలో నదియా.. లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న ఫోటో