AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు జక్కన్న ఎంతలా కష్టపడ్డారో చూశారా? ఆకట్టుకుంటోన్న ఆర్.ఆర్‌.ఆర్‌ మేకింగ్‌ వీడియో.

RRR Making Video: కేవలం ప్రేక్షకులే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినీ పరిశ్రమ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. బాహుబలిలాంటి...

RRR Movie: అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు జక్కన్న ఎంతలా కష్టపడ్డారో చూశారా? ఆకట్టుకుంటోన్న ఆర్.ఆర్‌.ఆర్‌ మేకింగ్‌ వీడియో.
Rrr Making Video
Narender Vaitla
|

Updated on: Jul 15, 2021 | 11:38 AM

Share

RRR Making Video: కేవలం ప్రేక్షకులే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినీ పరిశ్రమ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. బాహుబలిలాంటి సెన్సేషన్‌ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి బడా హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు జక్కన్న. నిజానికి ఇపాటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తిరిగి షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమా వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఎలాంటి అప్‌డేట్‌ లేదని నిరుత్సాహపడుతోన్న సినీ లవర్స్‌కు రాజమౌళి తాజాగా ఓ ట్రీట్‌ ఇచ్చారు.

హామీ ఇచ్చినట్లుగానే గురువారం ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియో ఆకట్టుకుంటోంది. ప్రతీ సన్నివేశాన్ని శిల్పంగా చెక్కే టాలీవుడ్‌ జక్కన్న ఈ సినిమాను కూడా ఓ కళా ఖండంగా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎక్కడా రాజీ పడకుండా భారీ సెట్టింగ్‌లతో చిత్రీకరణ చేపట్టారు రాజమౌళి. మేకింగ్ వీడియో చూస్తుంటే ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు టాలీవుడ్‌ సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ప్రతీ సన్నివేశం రాజమౌళి పడ్డ కష్టానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఈ సూపర్‌ మేకింగ్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. ఈ సినిమాను అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read: OTT Virus సోకకుండా జాగ్రత్త పడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంతకీ అంత భయమెందుకు?

Bandla Ganesh: మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్‌.. సాయం అడిగిన వెంటనే గూగుల్‌ పే నెంబర్‌ పంపమంటూ.

RAPO 19 Movie : రామ్ సినిమాలో నదియా.. లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న ఫోటో