AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: రోషిణిని అనుమానిస్తున్న మోనిత.. కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడానికి సరికొత్త ప్లాన్‌తో రెడీ

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1093 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. 25వ తేదీని మార్క్ చేసి పెట్టుకుని నా భర్తని నన్ను అందించాలని చూస్తున్నట్లున్నావు..

Karthika Deepam: రోషిణిని అనుమానిస్తున్న మోనిత.. కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడానికి సరికొత్త ప్లాన్‌తో రెడీ
Karthika Deepam
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 16, 2021 | 10:34 AM

Share

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1093 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. 25వ తేదీని మార్క్ చేసి పెట్టుకుని నా భర్తని నన్ను అందించాలని చూస్తున్నట్లున్నావు.. ఇదే 25వ తేదీన నీకు పెళ్లి కావాలా.. జైలు కావాలా తేల్చుకో అని దీప వార్నింగ్ ఇస్తుంది. నీ ప్రియసఖి ప్రియమణి ఏది ఇంత జరుగుతున్నా రాలేది ఏమిటి.. మంచి నీరు తాగు అంటూ దీప భాగ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మోనిత .. దీప ఇచ్చిన వార్నింగ్ తో డీప్ షాక్ లోకి వెళ్ళుతుంది. ఆనందరావు కోసం దీప శ్రావ్య, హిమ శౌర్య కార్తీక్ ఎదురుచూస్తుంటారు. ఎందుకు మీరు డల్ గా ఉన్నారు.. ఇన్ని రోజుల తర్వాత తాతయ్య వస్తుంటే అందరూ హ్యాపీగా ఉండాలిగా అంటుంది హిమ.. శ్రావ్య మీవి భూతద్దాలే అంటుంది. దీప కార్తీక్ కి టీ తీసుకుని రానా అంటునే… ఎవరు చెప్పరు.. టెన్షన్ పడకండి.. మీ డాడీకి అనుమానం వస్తుంది అంటుంది. తాతయ్య ఇంకా రాలేదు ఏమిటి అంటే.. ఆదిత్య వచ్చేటప్పుడు తాబేలుగా స్లోగా వస్తాడు అని అంటే.. అందరూ నవ్వుకుంటారు.. అదే సమయంలో ఆదిత్య, ఆనందరావు లు వస్తారు.. ఆ కుటుంబం ఇలా నవ్వుతుంటే నాకు సంతోషంగా ఉంది అంటే.. ఆదిత్య నేను నవ్వడం లేదుగా అంటాడు.. ఇంతలో ఆనందరావు దీప ఎలా ఉన్నావు.. అంటే.. పక్కనే డాక్టర్ బాబు ఉండగా నా ఆరోగ్యానికి లోటు ఏమిటి అంటుంది దీప.. కార్తీక్ డల్ గా ఉండడం చూసి.. ఎందుకు అలా ఉన్నావు.. మీ అమ్మ గురించి బెంగ అంటాడు.. లేదు డాడీ.. మీరు ఇద్దరూ మాకు ఒక్కటే అంటాడు కార్తీక్.. ఇంతలో దీప టీ తీసుకుని రానా వద్దు.. వంట చేయి.. నీ చేతి వంట తిని చాలా రోజులైంది.. అంటే దోసకాయ పచ్చడి చేయమ్మా అంటుంది హిమ. గిఫ్ట్ తీసుకుని రమ్మనమని ఆనందరావు ఆదిత్యని పిల్లలని బయటకు పంపిస్తాడు.

మీ నవ్వుల్లో జీవం లేదు అంటూ.. రీజన్ చెప్పమంటాడు ఆనందరావు. చేశా.. ఇంకో నాలుగు రోజులు నన్ను కలకత్తాలో ఉండమంది.. అంటే.. అమ్మ కూడా ఇంకో నాలుగు రోజుల్లో వస్తుంది కనుక అన్నీ మీకు డౌట్లే అంటాడు కార్తీక్.

ప్రియమణిని ఇంట్రాగేట్ చేస్తున్న రోషిణి … ప్రియమణిని నీ ఒరిజినల్ పేరు చెప్పమని అడుగుతుంది. పైడమ్మ అని చెబుతుంది. మోనిత గురించి చాలా రహస్యాలు తెలుసు.. వాటిని బయటపెడితే.. మోనిత చంపేస్తుందని భయపడుతున్నట్లు ఉన్నావు.. అంటూ ప్రియమణిని రోషిణి భయపెడుతుంది. కార్తీక్ మోనిత రిలేషన్ గురించి చెప్పమంటుంది. మా అమ్మగారే కార్తీక్ ని ప్రేమించింది.. కార్తీక్ కొంచెం తక్కువ ప్రేమించాడు. అంటుంది కానీ నేను పనిలో చేరక ముందు మోనిత ను కార్తీక్ పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడట.. అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మగారు పెళ్లి ఆపేసేరట. మరి ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నట్లు ఉన్నడమ్మా.. ఒప్పోకోనట్లు ఉన్నడమ్మా అంటే.. మరి మోనిత కడుపులో బిడ్డకు తండ్రి కార్తీకయ్యెనమ్మా అంటుంది. తాను నిన్ను ఎంక్వైరీ చేసినట్లు మోనిత కు చెప్పవద్దు… పిలిచినప్పుడు రావాలి అని రోషిణి వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్ మోనిత ను పెళ్లి చేసుకోవడం వరకూ వెళ్లాడని ఇది చెబుతుంది.. దీప ఏమో.. నా భర్త అలాంటి వాడు కాదు అంటుంది.. ఎవరు నిజం చెబుతున్నారు ఎవరు అబద్ధం చెబుతున్నారు అని ఆలోచిస్తుంది.

భాగ్యం మురళీకృష్ణతో దీప మోనితకు వార్నింగ్ ఇచ్చిన విషయం చెబుతుంది. దీప కాపురం నిలబడినట్లే అని చెబుతుంది. దీప భర్తతో మాట్లాడితే.. మోనిత దగ్గర మాట జారితే.. మోనిత మళ్ళీ కొత్త ప్లాన్స్ వేస్తుంది. దీపకు తెలివితో పాటు.. పొగరు కూడా ఉంది. అంటుంది.

ప్రియమణి తనను రోషిణి ఎంక్వైరీ చేసిన విషయం చెబుతుంది. మీతో చెప్పొద్దూ అంది.. అందరూ కలిసి నిన్ను ఎదో చేస్తారని భయం గా ఉందమ్మా అంటుంది ప్రియమణి. రోషిణి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తే.. నా పరిస్థితి ఏమిటి.. కార్తీక్ నాకు దక్కడా.. నో ఎట్టిపరిస్థితిలోను నేను కార్తీక్ ని వదులుకోను.. నా కార్తీక్ నాకు దక్కాలంటే నేను ఏమి చేయాలనీ అంటూ మోనిత ఆలోచిస్తుంది.

మరోవైపు ఆనందరావు రాకతో.. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తుంటే.. కార్తీక్.. మోనిత మాటలను ఆలోచిస్తుంటాడు. ఇంతలో కార్తీక్ మోనిత ఫోన్ చేస్తుంది. వీడియో పంపించానని అది చూడమని చెబుతుంది. దీంతో దీపని పిల్లలని తీసుకుని ఇంటికి వెళ్ళామని .. తాను తర్వాత వస్తానని చెబుతాడు.