Surekha Sikri Dead: మూడుసార్లు జాతీయ అవార్డు విన్నర్.. చిన్నారిపెళ్లి కూతురు ఫేమ్ సురేఖ సిక్రీ గుండెపోటుతో మృతి..

Surekha Sikri Dead: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి సురేఖా సిక్రీ శుక్రవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్..

Surekha Sikri Dead: మూడుసార్లు జాతీయ అవార్డు విన్నర్.. చిన్నారిపెళ్లి కూతురు ఫేమ్ సురేఖ సిక్రీ గుండెపోటుతో మృతి..
Actress Surekha
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 16, 2021 | 10:56 AM

Surekha Sikri Dead: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి సురేఖా సిక్రీ శుక్రవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో కళ్యాణి దేవిగా పరిచయం అయ్యారు. తన నటనతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. సురేఖా వయస్సు 75 సంవత్సరాలు. సురేఖ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సురేఖ సిక్రీ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. 2018 లో పక్షవాతంతో.. 2020 లో బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడ్డారు.

సురేఖా సిక్రీ 19 ఏప్రిల్ 1945న జన్మించారు.. 16 జూలై 2021 మరణించారు. సురేఖా సిక్రీ 1978 లో కిస్సా కుర్సి కా చిత్రంతో తెరంగేట్రం చేశారు. తమాస్ (1988), మమ్మో (1995) మరియు బధాయ్ హో (2018) చిత్రాలోని నటనతో మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు.

బుల్లి తెరపై బాలికా వధూ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై కూడా తన నటనతో అలరించారు. ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన బధాయ్ హో లో సురేఖ సిక్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. సురేఖ హిందీ, మలయాళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించారు. హిందీ థియేటర్ కోసం చేసిన కృషికి 1989 లో సంగీత నాటక్ అకాడమీ అవార్డును గెలుచుకున్నారు.

Also Read: Karthika Deepam: రోషిణిని అనుమానిస్తున్న మోనిత.. కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడానికి సరికొత్త ప్లాన్‌తో రెడీ