Menstrual Health: మహిళలు రుతుక్రమం సమయంలో చేసే తప్పులు ఇవే.. ఈ సూచనలు పాటించాలంటున్న వైద్యులు
Menstrual Health: మహిళలకు ప్రతి నెల ఇబ్బంది కలిగించే అంశం రుతుక్రమం. ఇది ప్రతీ మహిళ ఎదుర్కొవాల్సిందే. అయితే రుతుక్రమం సమయంలో మహిళలు న్యాప్‌కిన్స్ ను..
Menstrual Health: మహిళలకు ప్రతి నెల ఇబ్బంది కలిగించే అంశం రుతుక్రమం. ఇది ప్రతీ మహిళ ఎదుర్కొవాల్సిందే. అయితే రుతుక్రమం సమయంలో మహిళలు న్యాప్‌కిన్స్ ను గంటల తరబడి వాడటం నుంచి ప్రైవేటు పార్ట్ వద్ద శుభ్ర పర్చుకోవడం వరకు మహిళలు చేసే తప్పులు వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధికంగా శానిటరీ న్యాప్‌కిన్స్ వాడుతుండటం, తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల ఆ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మహిళలు చేసే తప్పులు ఇవే..
మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పి కలుగడం సాధారణమైన విషయమే. అయితే ఆ ప్రాంతం వద్ద నీటితో శుభ్ర పర్చుకోవడంతో పాటు సబ్బులు, జల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇటువంటి ఉత్పత్తుల్లో ఉండే రసాయనం వల్ల ఆ ప్రాంతంలో చర్మం దెబ్బతిని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.
నొప్పి నివారణకు మందులు వేసుకోవడం..
అమెరికన్ నేషనల్ లైబ్రేరీ ఆఫ్ మెడిసిన్ వివరాల ప్రకారం.. రుతుక్రమం సమయంలో మహిళలకు నొప్పిని నివారించేందుకు రకరకాల మందులను వాడుతుంటారు. దీంతో మందులు వాడటం వల్ల ఆ ప్రాతంలో బ్యాక్టీరియా తొలగిపోతుంది. కానీ అలా మందులను వాడటం భవిష్యత్తులో మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వంటింటి చిట్కాలు ఉపయోగిస్తే బాగుంటుందని, నోటిలో రెండు లవంగాలు, రెండు ఏలకులు వేసుకోవడం వల్ల తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
గంటల తరబడి శానిటరీ న్యాప్‌కిన్స్ ఉపయోగిస్తు్న్నారా..?
అయితే మహిళలు రుతుక్రమం సమయంలో గంటల తరబడి శానిటరీ న్యాప్‌కిన్స్ ఉపయోగించడం వల్ల ప్రమాదమేనంటున్నారు నిపుణులు. వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల గాలి ప్రసరణ తగ్గుతుంది. దీంతో అలెర్జీ, ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంది. అందు వల్ల ప్రతి మూడు గంటలకోసారి శానిటరీ న్యాప్‌కిన్స్‌ను మార్చడం మంచిదంటున్నారు.
పీరియడ్స్ సమయంలో మంచి అహారం
మహిళలకు పీరియడ్స్ సమయంలో చాలా చికాకుగా ఉంటుంది. అంతేకాదు నొప్పి కూడా ఉంటుంది. ఆ సమయంలో మహిళలు బలహీనపడకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీంతోపాటు ఎక్కువగా నీరు తాగడం ఎంతో మందిదంటున్నారు.