Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా..? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్టరు..!
Dragon Fruit Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే తినే ఆహారం,..
Dragon Fruit Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే తినే ఆహారం, ఒత్తిడి, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యం బాగుండాలంటే వివిధ రకాల పండ్లను తినాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. పండ్లు తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. దాదాపు అవన్నీ ఒకే ఒక్క చోట దొరికే పండు డ్రాగన్. ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యం మన వెంటే అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఈ పండును ఇటీవల ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ లభిస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు.. అందులో నల్లటి విత్తనాలు ఉంటాయి.
డ్రాగప్ ఫ్రూట్ అనే పేరు ఎలా వచ్చింది..?
డ్రాగన్ ఫ్రూట్ అనే పేరే చిత్రంగా ఉంటుంది. దీనిని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తుంటారు. డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ… శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మరి ఆ పేరును ఈ పండ్లకు ఎందుకు పెట్టారంటే, వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల కారణంగా ఎన్ని పండ్లు ఉన్న డ్రాగన్ పండ్లను సులభంగా గుర్తు పట్టవచ్చు. గులాబీ రంగులో ఉండే ఈ పండుకి చుట్టూ ఉన్న రేకులు పసుపు, పచ్చ రంగులో ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయ్‌లాండ్, వియత్నాం ప్రజలకు ఈ పండ్లంటే విపరీతమైన ఇష్టం.
కేలరీలు తక్కువ.. ఖనిజాలు ఎక్కువ..
ఈ డ్రాగన్ ఫలంలో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అందుకే ఈ పండు తినడం ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాధులను దూరం చేసే పండు
ప్రస్తుతమున్న కాలంలో మనిషి రోగనిరోధక శక్తి కోల్పోతున్నాడు. ముందే కరోనా కాలం.. అందుకే వర్షాకాలం కారణంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. దీంతో అనారోగ్యం బారినపడతాం. ఈ ఫ్రూట్ తింటే నిగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వివిధ రకాల వ్యాధులు దరి చేరనివ్వకుండా నుంచి కాపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో నేచురల్ గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్ ను, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. డ్రాగన్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయని చెబుతుంటారు. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
ఇమ్యునిటీకి
ఈ డ్రాగన్ పండులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు ఇమ్యునిటీని పెంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ ను కాపాడటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. దీంతో అంటువ్యాధులు గానీ ఇతర ఏ జబ్బులు గానీ మన దరి చేరకుండా చూస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కావటానికి ఆక్సీజన్ అవసరం. ఒంటి నిండా ప్రాణ వాయువు సరఫరా కావాలంటే ఐరన్ పుష్కలంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. మిగతా అన్ని పండ్లతో పోల్చితే మెగ్నీషియం ఎక్కువగా ఉండేది డ్రాగన్ ఫలంలోనే. బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. గింజలతో సహా తింటారు. కరకరలాడే ఆ గింజలు అందరికీ నచ్చుతాయి.
వీటికి ధర ఎక్కువే
ప్రస్తుతం ఈ పండ్లు సూపర్ మార్కెట్లలో లభిస్తుంటాయి. ఒక్కో పండు (సుమారు 400 గ్రాములు బరువు ఉండేది) ధర రూ.70 నుంచీ రూ.100 వరకు ఉంటుంది. అయితే ధర కాస్త ఎక్కువైనా చాలా మందే కొంటుంటారు. ఇంతకీ ఈ పండ్ల రుచి ఎలా ఉంటుందో చెప్పలేదు కదా. ఇవి కొద్దిగా పుల్లగా, కొద్దిగా తీపిగా ఉంటాయి. మరీ ఎక్కువ తీపిదనం ఉండవు.