Diabetes: డయాబెటిస్‌ ఉన్న వారు కోడి గుడ్లు తినొచ్చా..? సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు

Diabetes: డయాబెటిస్‌ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వంశపారపర్యంగా, ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు తదితర కారణాలతో డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. అయితే..

Diabetes: డయాబెటిస్‌ ఉన్న వారు కోడి గుడ్లు తినొచ్చా..? సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 15, 2021 | 5:09 PM

Diabetes: డయాబెటిస్‌ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వంశపారపర్యంగా, ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు తదితర కారణాలతో డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చిన వారు రోజువారీ తినే ఆహారంలో మార్పులతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది దినొచ్చో.. ఏది తినకూడదో తెలుసుకుని ఆరోగ్యానికి హాని ఉండవనే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అదే విధంగా కోడిగుడ్డు విష‌యంలో కూడా షుగ‌ర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని చాలామంది డ‌యాబెటిక్ రోగులు భ‌య‌ప‌డుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గిన‌ట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. ‘సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన ఆ అధ్యయనం ప్రకారం.. గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిస్‌ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.

అయితే పరిశోధనలలో పాల్గొన్న వాలంటీర్లను మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో గరిష్టంగా వారానికి 12 గుడ్లు, కనిష్టంగా ఒక గుడ్డు చొప్పున ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు వారికి గుడ్లు అందించారు. ఆ త‌ర్వాత చివరిగా అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ ప‌రిశీల‌న‌లో గుడ్లు ఎక్కువ‌గా తిన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనపించలేద‌ట‌. దాంతో గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డ‌యాబెటిస్‌ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని పరిశోధకులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

కాగా, షుగర్‌ వ్యాధి ఉన్న వారి ఇలా ఆహారం విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. చాలా మందికి ఎలాంటి ఆహారం తినాలి.. ఎలాంటి ఆహారం తినకూడదు. ఎలాంటి పండ్లు తినాలి అనే విషయాలు తెలిసి ఉండవు. దీంతో కొందరు ఏది పడితే అది తినడం కూడా షుగర్‌ లెవల్స్‌ పెరిగి రోగాల బారిన పడుతుంటారు. డయాబెటిస్‌ ఉన్నవారు రోజు వారీగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Cough Remedies: దగ్గుతో బాధపడుతున్నారా.? అయితే ఈ వంటింటి చిట్కాలు మీకోసమే.!

Blood Pressure: ఒక్క చేతితో రక్తపోటును తనిఖీ చేసుకోవడం మంచిదేనా? అసలు బీపీ చెక్ చేసుకునే విధానం ఏమిటి?