Bisleri Hand Purifier & TV9 Network Initiative: కరోనాకు ఇలా చెక్ పెట్టండి.. టీవీ9, బిస్లరీ ప్రచారానికి అపూర్వ స్పందన
Bisleri Hand Purifier & TV9 Network Initiative: కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ.. మూడో వేవ్ ముప్పు మనందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలో కరోనా నిబంధనలు
Bisleri Hand Purifier & TV9 Network Initiative: కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ.. మూడో వేవ్ ముప్పు మనందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలో కరోనా నిబంధనలు పాటించడమే.. మనకు శ్రీరామ రక్ష అని పలు అధ్యయనాలు, ప్రభుత్వం చూసిస్తున్నాయి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం.. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం మన ప్రధాన కర్తవ్యం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న కరోనా మనల్ని చుట్టుముడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 నెట్‌వర్క్.. బిస్లెరీ హ్యాండ్ ఫ్యూరిఫైర్స్‌తో చేతులు కలిపి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి (Haath Safe Rakho) అన్న నినాదంతో.. Bisleri Hand Purifiers & TV9 Network ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ‘వ్యాన్ దగ్గరకు రండి.. చేతులు శుభ్రం చేసుకోండి’ అంటూ ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమానికి హైదరాబాద్‌లో విశేష స్పందన లభిస్తోంది.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కరోనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై Bisleri Hand Purifiers & Tv9 Network కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. హాత్ సేఫ్ రఖో (Haath Safe Rakho) నినాదంతో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది ప్రచార వ్యాన్ దగ్గరకు వచ్చి చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. దీంతోపాటు టీవీ9, బిస్లెరీ హ్యాండ్ ఫ్యూరిఫైర్స్ నిర్వహిస్తున్న ఈ ప్రచారాన్ని ప్రశంసిస్తున్నారు.
భాగ్యనగరం పరిధిలో ఈ వ్యాన్ నిత్యం సంచరిస్తూ.. కరోనా నుంచి తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కలిగిస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో బయటకు వచ్చిన వారికి సిబ్బంది శానిటైజ్ చేస్తూ రక్షణ చర్యలను గుర్తుచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ‘వ్యాన్ దగ్గరకు రండి.. చేతులు శుభ్రం చేసుకోండి’ అంటూ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. కరోనా నుంచి కాపాడుకోవాలంటే.. భౌతిక దూరంతోపాటు మాస్క్ ధరించడం తప్పనిసరని.. వీటితోబాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. వివిధ పనుల కోసం బయటకు వస్తున్న ప్రజలకు తమ బాధ్యతను గుర్తుచేస్తున్నారంటూ హైదరాబాద్ వాసులు.. ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నారు.
కాగా ఈ ప్రచారం.. హైదరాబాద్ నగరంతోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా Bisleri Hand Purifiers & Tv9 Network ఆధ్వర్యంలో అవగాహన ప్రచారం కొనసాగుతోంది. కావున మీరు కూడా బాధ్యతను గుర్తుంచుకోండి.. కరోనా నిబంధనలను తప్పని సరిగా పాటించి.. మహమ్మారిని అరికట్టండి.. అంటూ టీవీ9 నెట్‌వర్క్.. బిస్లెరీ హ్యాండ్ ఫ్యూరిఫైర్స్ కోరుతున్నాయి.
Also Read: