AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవతా విగ్రహాన్ని విరగగొట్టాడని వృద్దునిపై యువకుల దాడి.. ఎక్కడంటే ?

మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో ఓ వృద్దుడు దేవతా విగ్రహాన్ని విరగగొట్టాడన్న ఆరోపణపై అతడిమీద కొందరు యువకులు దాడి చేశారు. దుర్భాషలాడుతూ అతడి జుట్టు పట్టుకుని లాగి కింద పడవేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. బాధతో ఆ వృద్దుడు కేకలు పెడుతున్నా

దేవతా విగ్రహాన్ని విరగగొట్టాడని వృద్దునిపై యువకుల దాడి.. ఎక్కడంటే ?
Youth Thrashing Eldely Man In Madhya Pradesh
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 17, 2021 | 5:00 PM

Share

మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో ఓ వృద్దుడు దేవతా విగ్రహాన్ని విరగగొట్టాడన్న ఆరోపణపై అతడిమీద కొందరు యువకులు దాడి చేశారు. దుర్భాషలాడుతూ అతడి జుట్టు పట్టుకుని లాగి కింద పడవేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. బాధతో ఆ వృద్దుడు కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా రాక్షసంగా ప్రవర్తించారు.. కమల్ దాస్ అనే ఈ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేనివాడని..ఎన్నో ఏళ్లుగా దగ్గరలోని శ్మశాన వాటిక వద్ద నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. మూల్ చంద్ మార్గ్ అనే చోట శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. విగ్రహం పగులగొట్టాడన్న కసితో అతని చుట్టూ మూగిన ఈ యువకులు చేసిన దాడి వీడియోకెక్కింది. మెంటల్ గా అతని పరిస్థితి బాగు లేదని తెలిసినా.., అతని వయస్సును చూసి అయినా ఆ యువకులు ఏ మాత్రం జాలి లేకుండా ఎటాక్ కి పాల్పడ్డారు. ఇదంతా చోద్యంలా చూస్తున్న స్థానికుల్లో ఒక్కరైనా వారిని అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. ఈ దాడిలో బాధితుని చెయ్యి విరిగినట్టు ఉందని ఓ వ్యక్తి తెలిపాడు.

ఈ వీడియో చూసిన పోలీసులు తమకు తాముగా దీనిపై కేసు పెట్టి ఆ యువకులపై చర్య తీసుకునేందుకు ఉపక్రమించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మూల్ చంద్ ప్రాంతంలో ఈ యువకుల ఆధిపత్యానికి అడ్డు అంటూ లేకుండా పోయిందని పోలీసులు అంటున్నారు. పరారీలో ఉన్న వీరిని అరెస్టు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఈ విధమైన ఘటనలు పెరిగి[పోతున్నాయని, అమాయకులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.

 భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.

 భూమీద నూకలున్నాయి అందుకే బ్రతికాడు..తృటిలో తప్పిన ప్రమాదం..అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వ్యక్తి పై పడిన చెట్టు:Mahbhubnagar video.

 వరద నీటిలో ఈ బుడ్డోడి ఆటే వేరు.. వరద నీటిలో ఆడుతూ నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారుల వీడియో :Children in Water Video.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!