YV Subbareddy: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు.. రెండోసారి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమాకం!

మరోమారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్‌గా ఆయన్ను తిరిగి కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది

YV Subbareddy: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు.. రెండోసారి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమాకం!
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 17, 2021 | 2:55 PM

YV Subbareddy as TTD Chairman Second Chance: మరోమారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్‌గా ఆయన్ను తిరిగి కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా టీటీడీ విషయం గురించి ప్రస్తావించిన ఆయన.. సుబ్బారెడ్డినే మరో రెండున్నరేళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు.

ఇదిలావుంటే, ఆయన ఒకటి తలిస్తే మరోకటి అయ్యినట్లుగా ఉంది పరిస్థితి. టీటీడీ ఛైర్మన్‌గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. తనను నమ్ముకున్నోళ్లకి ఏమీ చేయలేకపోయానని.. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విషయం సీఎం జగన్‌‌కు వివరించానని కూడా చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు. దీంతో ఆయన వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ప్రచారం కూడా సాగింది. ఇవన్నింటికి చెక్ పెడుతూ.. తాజాగా జగన్ సర్కార్ ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది.

అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీ సీటును వైవీ సుబ్బారెడ్డి కష్టంగానే వదులుకున్నారు. సీఎం జగన్ మాట మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లోక్‌సభ సీటును వైవీ త్యాగం చేయకతప్పలేదు. ఆ తర్వాత సీఎం జగన్ ఆయన్ను టీటీడీ ఛైర్మన్‌గా నియమించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆ పదవీ కాలం ముగియడంతో వాట్ నెక్స్ట్ అన్న చర్చ కొనసాగింది. నిజానికి వైవీ సుబ్బారెడ్డి కోరుకుని ఉంటే టీటీడీ ఛైర్మన్ పదవి ఆయనకు రెన్యువల్ వెంటనే అయ్యిపోయేది. అయితే, ఆ పదవిలో కొనసాగడం కంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉండటానికే వైవీ సుబ్బారెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవిని వైవీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, అనూహ్యంగా మరోమారు టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించడం హాట్ టాపిక్‌గా మారింది. చైర్మన్‌గా మరో రెండున్నరేళ్లు ఆయనే కొనసాగనున్నారు.

మరోవైపు కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవుల రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. ఎవరికీ కూడా కార్పొరేసన్, చైర్మన్ పదవులకు అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కోర్పారేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు జరిపారు.

Read Also….  SV Mohan Reddy: ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయించాడు : వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి