Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SV Mohan Reddy: ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయించాడు : వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..

SV Mohan Reddy: ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయించాడు : వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి
S V Mohan Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 17, 2021 | 2:00 PM

YCP Leader SV Mohan Reddy – Krishna waters: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు అన్యాయమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర జలసంఘం ఇచ్చిన గెజిట్ అడ్డుకోవాలని తన పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సరికాదని మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్ ను స్వాగతిస్తున్నామని ఆయన కర్నూలులో తెలిపారు.

పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబు పైనా మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు లేఖ రాయించాడని ఆయన ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారు..! అంటే.. అది చంద్రబాబు నాయుడేనని మోహన్ రెడ్డి దుయ్యబట్టారు.

కాగా, జల వివాదానికి సంబంధించి కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ మీద వైసీపీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి దీనికి సంబంధించి ప్రకటన వెలువడిన అనంతరం వైసీపీ నేత మల్లాది విష్ణు సంతోషం వ్యక్తం చేయగా, అటు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఆనందం వెలిబుచ్చారు. ఇదో పెద్ద ముందడుగుగా భావిస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు.

Read also: GVL: అపోహలు కలిగించేలా పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు : జీవీఎల్

KKR New Captain: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ధోని అల్టిమేట్ ప్లేయర్
KKR New Captain: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ధోని అల్టిమేట్ ప్లేయర్
ఎన్టీఆర్, నీల్ సినిమా పై హైప్ పెంచేసిన నిర్మాత..
ఎన్టీఆర్, నీల్ సినిమా పై హైప్ పెంచేసిన నిర్మాత..
మర్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్‌!
మర్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్‌!
ఆకలితోపాటు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజర్‌లో ఉన్నట్లే
ఆకలితోపాటు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజర్‌లో ఉన్నట్లే
భర్తలు బహుపరాక్ మీ భార్యలో ఈ లక్షలుంటే మీ పట్ల అసంతృప్తి ఉన్నట్లే
భర్తలు బహుపరాక్ మీ భార్యలో ఈ లక్షలుంటే మీ పట్ల అసంతృప్తి ఉన్నట్లే
ఒక్క వర్షానికే నీట మునిగిన గడాఫీ స్టేడియం.. PCB బొక్కబోర్లా!
ఒక్క వర్షానికే నీట మునిగిన గడాఫీ స్టేడియం.. PCB బొక్కబోర్లా!
ఒక్క కాల్.. బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.13 లక్షలు మాయం..
ఒక్క కాల్.. బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.13 లక్షలు మాయం..
కడుపు మండిన కాకుల కథ.. ఇరగదీసిన నాని..
కడుపు మండిన కాకుల కథ.. ఇరగదీసిన నాని..
ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. గ్లోబల్ ర్యాంకింగ్స్ విడుదల..
ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. గ్లోబల్ ర్యాంకింగ్స్ విడుదల..
వాంతులు చేసుకుంటున్న పెట్ డాగ్.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా...
వాంతులు చేసుకుంటున్న పెట్ డాగ్.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా...