Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GVL: అపోహలు కలిగించేలా పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు : జీవీఎల్

కృష్ణా, గోదావరి నదుల విస్తీర్ణంపై నోటిఫికేషన్ శుభపరిణామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్ పై రాజకీయ పార్టీల..

GVL: అపోహలు కలిగించేలా పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు : జీవీఎల్
G. V. L. Narasimha Rao
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 17, 2021 | 1:28 PM

Krishna waters: కృష్ణా, గోదావరి నదుల విస్తీర్ణంపై నోటిఫికేషన్ శుభపరిణామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్ పై రాజకీయ పార్టీల వక్ర భాష్యం తగదన్న ఆయన, కృష్ణా జలాల వాటర్ మేనేజ్ మెంట్‌పై పూర్తి హక్కులు బోర్డుకే ఉంటాయని జీవీఎల్ వెల్లడించారు. అపోహలు కలిగించేలా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జీవీఎల్ కోరారు. ఇవాళ గుంటూరులో మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. కృష్టా జలాల విషయంలో రాష్టాల ఏకపక్ష నిర్ణయాన్ని నోటిఫికేషన్ రద్దు చేసిందన్నారు.

ఇలా ఉండగా, కృష్ణా జలాల నీటి వినియోగం మీద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిన్న డైరెక్షన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కొంత కాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదానికి చరమగీతం అన్నట్టుగా ఒక్కో రాష్ట్రానికి నీటి వాటా ఎంత? వినియోగించాల్సింది ఎంత? అనే దానిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి పూర్తి క్లారిటీ ఇచ్చింది. రెండు యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేసింది కేంద్ర జల శక్తి శాఖ. అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

అంతేకాదు, బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలో చేర్చింది కేంద్ర జలశక్తి శాఖ. కృష్ణా, గోదావరి నదీ యజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ లో పేర్కొంది. ఫలితంగా బోర్డుల పరిధిలోకి కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు వస్తాయి.

అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలి. అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్లు అమల్లోకి రానున్నాయి. ఇక, ఒక్కో రాష్ట్రం బోర్డుకు 200 కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్‌ చేయాలి. సీడ్‌ మనీ కింద ఈ మొత్తాన్ని 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లో చెల్లించాలని కేంద్రం సూచించింది.

Read also: YS Jagan: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల జాతర.. సామాజిక న్యాయానికి పెద్దపీట

చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?