Hyderabad : అసలేం తెలియనట్లుగా మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చారు.. ఆపై పరారయ్యారు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!
Hyderabad City: హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంలో దారుణం వెలుగు చూసింది. మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో..
Hyderabad City: హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంలో దారుణం వెలుగు చూసింది. మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో మహిళ(25) మృతదేహాన్ని వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆటోలో మృతదేహాన్ని తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్పించిన ఆ వ్యక్తులు.. అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు, ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ ఆటోలో సుమారు 25 సంవత్సరాల వయస్సు గల మహిళను చికిత్స కోసం సూరారం మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మహిళను పరిశీలించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే, అది తెలుసుకున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది ఉదయం వరకు వేచి చూసినా మహిళకు సంబంధించిన బధువులు ఎవరూ రాలేదు. దాంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. మార్చురీలో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మహిళను తీసుకువచ్చిన ఆటోను సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. మృతురాలిని శుక్రవారం రాత్రి 10.25 గంటలకు ఒక ఆటోలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చినట్లు గుర్తించారు. అదే సమయంలో మహిళను తీసుకువచ్చిన వ్యక్తులు ఆమెకు సంబంధించిన ఎటువంటి వివరాలను ఆస్పత్రికి ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తేల్చారు. మృతురాలికి సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి శరీరంపై ఎడమ చేతిపై “LAXMI”, కుడి చేతిపై ‘M’ పచ్చబొట్టు ఉంది. ఎక్కడో హత్య చేసి హాస్పిటల్‌కు తీసుకువచ్చారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read:
Fire Accident: రన్నింగ్‌లో ఉన్న లారీకి ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. ఆ తరువాత చూస్తుండగానే..
TDP Protest: నెల్లూరు టీడీపీ నేతల సాహసోపేత నిరసన.. కొంచెం పొరపాటు జరిగినా ప్రమాదంలో పడేవారే..!
New Innovation: మీ ఇంట్లో ఈ పేపర్ ఉంటే చాలు.. ఏసీలు అవసరమే లేదు.. అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది..