Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Tv: స్మార్ట్‌ టీవీ కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ బడ్జెట్‌లో అధిక ఫీచర్స్‌..!

Smart Tv: ప్రస్తుతం కరోనా కాలంలో పలు స్మార్ట్‌ టీవీ సంస్థలు నష్టపోయాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నాయి. తక్కువ..

Smart Tv: స్మార్ట్‌ టీవీ కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ బడ్జెట్‌లో అధిక ఫీచర్స్‌..!
Smart Tv
Follow us
Subhash Goud

|

Updated on: Jul 20, 2021 | 2:02 PM

Smart Tv: ప్రస్తుతం కరోనా కాలంలో పలు స్మార్ట్‌ టీవీ సంస్థలు నష్టపోయాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నాయి. తక్కువ ధరలకే టీవీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక కొత్త టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. ప్రస్తుతం అందుబాటు ధరలో అదిరిపోయే స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వచ్చాయి. రూ.15 వేలలోపు ధరలో మంచి ఫీచర్లు ఉన్నా టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో ఓటీటీ యాప్, గూగుల్ అసిస్టెంట్, వైఫై, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇన్‌ఫినిక్స్ ఎక్స్1 పేరుతో ఒక స్మార్ట్ టీవీ ఉంది. ఇది 32 అంగుళాల టీవీ. ఇది హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా పైన పేర్కొన్న ఫీచర్లు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.14,499. దీని అసలు ధర రూ.17999. అంటే 19 శాతం తగ్గింపు ఆఫర్లలో లభ్యమవుతుంది. అలాగే ఐఫాల్కన్ 32 అంగుళాల టీవీలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ ఉంటాయి. ఇది డాల్బే సౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీ ధర కూడా రూ.13,499. దీని అసలు ధర రూ.18999. అంటే 28 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంఐ కంపెనీ కూడా అదిరిపోయే టీవీని అందిస్తోంది. దీని పేరు ఎంఐ 4ఏ ప్రో. ఇది కూడా 32 అంగుళాల టీవీ. ఇందులో పైన తెలిపిన ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. దీని ధర రూ.14,999. ఇకపోతే మీ వద్ద క్రెడిట్ కార్డు ఉంటే.. నెలకు రూ.500 నుంచి రూ.700 ఈఎంఐతో మీరు ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Washing Machine: బంపర్ ఆఫర్‌.. రూ.4,990కే కొత్త వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయండి..!

First Maruti Suzuki EV: మారుతి సుజుకీ కీలక నిర్ణయం..త్వరలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్లు.. ఎప్పుడంటే..!