KTR Birthday Gift: తెలంగాణలో దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో భారీ స్పందన

ప్రతి సంవత్సరం జరుపునే ఫుట్టిన రోజు వేడుకల్లో వెరైటీ లేకుంటే ఏం బాగుంటుంది. కొంత డిఫరెంట్ చేస్తే పేరుకు పేరు మంచికి మంచి అనుకున్నారు రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభిమానులు.

KTR Birthday Gift: తెలంగాణలో దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో భారీ స్పందన
Ktr Birthday Gift Scootys
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 22, 2021 | 1:02 PM

KTR Birthday Gift scootys to Differently abled Persons: ప్రతి సంవత్సరం జరుపునే ఫుట్టిన రోజు వేడుకల్లో వెరైటీ లేకుంటే ఏం బాగుంటుంది. కొంత డిఫరెంట్ చేస్తే పేరుకు పేరు మంచికి మంచి అనుకున్నారు రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభిమానులు. జులై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. కేక్ కటింగ్ నుంచి రక్త దానాల వరకు.. మొక్కల నాటడం నుంచి పేదల సాయం వరకు.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాని నిర్ణయించారు.

కార్యకర్తలు, నేతలతా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు షురూ చేశారు. ఈసారి వేడుకలు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు విభిన్నంగా ఆలోచన చేశారు. అయితే, ప్రతి ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టే కేటీఆర్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బర్త్ డే సందర్భంగా 100 మంది దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. అంతేకాదు తన బర్త్ డే వేడుకల కోసం ఫ్లెక్సీలు, బొకేలు, కేక్‌ల రూపంలో డబ్బులను వృధా చేయవద్దని.. వాటిని ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి వృక్షార్చనలో భాగమై మొక్కలను నాటాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ వంతుగా వాహనాలను విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తాన్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సారధ్యంలో పనిచేయడం తమ అదృష్టమని.. ఆయన అడుగు జాడల్లో నడుస్తామని బాల్క సుమన్ ట్వీట్ చేశారు.

మంత్రి కేటీఆర్ నిర్ణయం గర్వంగా ఉందని మంత్రి పువ్వాడ ఆజయ్ కుమార్ పేర్కొన్నారు, తానూ కూడా నాయకుడి అడుగుజాడలను అనుసరిస్తున్నన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా #GiftASmile కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు 50 వాహనాలను దానం చేస్తానని మంత్రి పువ్వాడ ట్వీట్ చేశారు.

మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన వంతుగా 60 వాహనాలను ఇచ్చేందుకు ముందకొచ్చారు. దివ్యాంగులకు స్కూటీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

గత ఏడాది కేటీఆర్ బర్త్ డే సంద్భంగా ఆయన 6 అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు. మంత్రి పిలుపుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చారు. 2020లో దాదాపు 100కు పైగానే అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆస్పత్రులకు అందించారు. మంత్రి కేటీఆర్ పిలుపునకు ఈసారి కూడా భారీగా స్పందన వస్తోంది. చాలా మంది నేతలు, కార్యకర్తలు దివ్యాంగులకు స్కూటీలు వచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. దివ్యాంగులకు వాహనాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also…

Yadadri temple: యాదాద్రి ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం..

Amravati lands Case: అమరావతి భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కేసులో కీలక మలుపు.. అప్పీల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!