రీల్స్ కోసం లేట్‌నైట్‌లో టెరస్‌పైకి వెళ్లిన యువతి.. కాసేపటికే వెలుగు చూసిన విషాదం!
ప్రస్తుత జనరేషన్ యూత్‌లో రోజురోజుకు సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. యువత సోషల్ మీడియా మోజులో ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే రోజు ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలానే విషాదకర రీల్స్ తీసేందుకు 13 అంతస్తుల భవనంపైకి ఎక్కిన ఓ యువతి రీల్స్ తీస్తూ ప్రమాదవశాత్తు లిఫ్ట్ గుంతలో పడి చనిపోయింది. ఈ విషాదకర ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

ఈ మధ్యన యువతలో రిల్స్ పిచ్చి పెరిగిపోయింది. సోషల్ మీడియా మోజులో ప్రమాదకర రీల్స్ చేస్తూ యువత తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో వెలుగు చూసింది. రీల్స్ చిత్రీకరించేందుకు టెరస్ పైకి వెళ్లిన యువతి ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోంయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బిహార్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి బెంగళూరులోని ఒక షాపింగ్ మాల్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తోంది. అయితే యవతి బుధవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో కలిసి పరప్పన అగ్రహారలోని నిర్మాణంలో ఉన్న 13 అంతస్తుల భవనంలోకి వెళ్లింది. అక్కడ వారితో కలిసి పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే పార్టీ తర్వాత ఓ ప్రేమ వ్యవహారానికి సంబంధించి వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గోడవ తర్వాత తీవ్ర మనస్తాని గురైన యువతి బిల్డింగ్ టెరస్‌పైకి వెళ్లి.. అక్కడ విచారకరమైన రీల్ చిత్రీకరించే ప్రయత్నంచింది. పైన మొత్తం చీకటిగా ఉండడంతో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ లిఫ్ట్ గుంతలో పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం గమనించిన ఆమె స్నేహితులు అక్కడి నుంచి పారిపోయినట్టు బిల్డింగ్ వాచ్‌మెన్ పోలీసులకు తెలిపారు.
వాచ్‌మెన్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సౌత్ ఈస్ట్ డీసీపీ ఫాతిమా స్పందిస్తూ.. బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఆ భవనంలో వెళ్లిన తర్వాత అక్కడ వారు పార్టీ చేసుకున్నారని.. ఆ తర్వాత రీల్స్ కోసం టెరస్‌పైకి వెళ్లగా.. రీల్స్ చేస్తూ ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మరణించిందని తెలిపారు. అయితే ఈమె మృతికి తన స్నేహితుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారమే కారణమా.. లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




