దేశవ్యాప్తంగా ముంచెత్తుతున్న వర్షాలు.. మూడురోజులుగా నాన్‌స్టాప్‌గా దంచికొట్టుడే!
నేల మీదనుంచి ఆర్తిగా ఇన్విటేషన్లు వచ్చాయో లేదో.. నింగి నుంచి ధారగా కురవడం మొదలైంది వర్షం. చిన్న బ్రేక్ ఇచ్చా.. లోపల నా ఒరిజినల్ అలానే ఉంది అంటూ సీజన్ ప్రారంభం నుంచే విశ్వరూపం చూపిస్తున్నాడు వరుణుడు. నిన్నటి దాకా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి. అలవాటు తప్పిందో ఏమో కుండపోత వానలతో విలవిల్లాడుతోంది ఉత్తరాది.

నేల మీదనుంచి ఆర్తిగా ఇన్విటేషన్లు వచ్చాయో లేదో.. నింగి నుంచి ధారగా కురవడం మొదలైంది వర్షం. చిన్న బ్రేక్ ఇచ్చా.. లోపల నా ఒరిజినల్ అలానే ఉంది అంటూ సీజన్ ప్రారంభం నుంచే విశ్వరూపం చూపిస్తున్నాడు వరుణుడు. నిన్నటి దాకా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి. అలవాటు తప్పిందో ఏమో కుండపోత వానలతో విలవిల్లాడుతోంది ఉత్తరాది.
ఢిల్లీ, గుజరాత్, కేరళ, కశ్మీర్, హర్యానా, ఉత్తరాంఖండ్, హిమాచల్ ప్రదేశ్.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు.. ఆసేతు హిమాచలాన్ని వణికిస్తోంది వర్ష బీభత్సం. మెరుపు వరదలతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తీరప్రాంతాల్లో జనానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది.
జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలుకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. తావి నదిలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. NDRF సిబ్బంది అప్రమత్తమై కాపాడి ఒడ్డుకు చేర్చారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో రాంబన్ జిల్లా చంద్రకోట్‌లో వాహనాలు నిలిచిపోయాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు సైంజ్ వ్యాలీలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా పార్వతి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇందిరా ప్రియదర్శిని హైడల్ ప్రాజెక్ట్ దగ్గరున్న లేబర్ కాలనీలో ఇద్దరు చనిపోగా, 20మందికి పైగా గల్లంతయ్యారు. అటు కేరళలోని వయనాడ్‌లోనూ మరోసారి వరద భయం పట్టుకుంది. ఢిల్లీలోని సైనిక ఫామ్ ప్రాంతాన్ని వరద మొంచెత్తడంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోయింది. కర్నాటక కలబురిగిలోనూ ఎడతెరపి లేకుండా కురుస్తోంది వర్షం. గుజరాత్‌లోని సూరత్ నగరం మూడ్రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లలో సెల్లార్లన్నీ నీటితో నిండిపోయాయి.
తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా మున్నార్‌లోని పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో కేఆర్‌ఎస్ డ్యామ్ నుంచి కావేరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హోగేనకల్ జలపాతం పర్యాటనను నిలిపివేశారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలంటూ కావేరి నదీ పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేశారు.
చిన్నపాటి వానే వణికే ముంబై సిటీ.. ఈసారి కూడా భారీ వర్షానికి జడుసుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో కింగ్స్ సర్కిల్, కాలాచౌకి స్టేషన్లలో నీళ్లు నిలిచాయి. ఇక ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీవర్షాలో అలకనందానది పొంగి పొర్లుతోంది. సరిగ్గా ఇదే సమయంలో రుద్రప్రయాగ్‌లోని ఘోల్తీర్ ప్రాంతంలో టూరిస్టు బస్సు నదిలో పడిపోయి 10 మంది గల్లంతయ్యారు. వర్షం ఆగకపోవడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది.
అటు.. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కనుక.. రాబోయే వారం రోజులూ దేశానికి వాన గండం పొంచి ఉన్నట్టేనా…?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




