AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన ఆహారమే మన శత్రువు.. లోపలికి వెళ్లేదంతా రసాయనమేనా..!

మీ పేస్ట్‌లో ఉప్పుందా, మీ పేస్ట్‌లో బొగ్గు ఉందా అని కొన్ని యాడ్స్ చూస్తుంటాం. కాని, మీ పేస్ట్‌లో సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియం అనే మోస్ట్‌ డేంజర్‌ కెమికల్స్‌ ఉన్నాయి. పళ్లు తళతళమెరిసిపోవడం తరువాత.. అవి లోపలికి వెళ్లి శరీర అవయవాలను పాడుచేస్తున్నాయి. అంటే.. లేవగానే ఆవగింతం కెమికల్‌ నోట్లోకి తీసుకుని, కడుపునిండా రసాయనాహారం నింపుకుని బతికేస్తున్నాం.

మన ఆహారమే మన శత్రువు.. లోపలికి వెళ్లేదంతా రసాయనమేనా..!
Our Food At Risk
Balaraju Goud
|

Updated on: Jun 26, 2025 | 9:45 PM

Share

పోయిన జనవరిలో మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జస్ట్‌ వారం రోజుల్లోనే ఊళ్లోని వాళ్లందరికి బట్టతల వచ్చేసింది. ఒక ఊరు కాదు.. బుల్దానా జిల్లాలోని పలు గ్రామాల్లోని వారికి జుట్టు ఊడిపోయింది. వెంట్రుకల మీద ఎంత మోజో చాలామందికి. వాళ్లంతా గగ్గోలుపెట్టే సరికి శోధించడం మొదలుపెట్టారు ఏం జరిగి ఉంటుందా అని. తీరా తెలిసిందేంటంటే.. రేషన్‌ షాపుల్లో ఇచ్చిన గోధుమలు తిన్నందుకని తేలింది. లావైపోతున్నామని ఈమధ్య యువతంతా రొట్టెలు తింటుంటే.. అది కాస్తా బెడిసికొట్టి బట్టతల వస్తే ఎలా అని తెగ ఫీలైపోయారు. కాని, సమస్య గోధుమల్లో లేదు. గోధుమ పంటకు వాడిన పురుగుమందుల్లో ఉంది. సెలీనియం కంటెంట్‌ ఎక్కువగా ఉండడంతో లక్షణాలు మొదలైన మూడు నాలుగు రోజుల్లోనే బట్టతల వచ్చేసింది. జుట్టుదేముంది.. ముందు ప్రాణం ఉండాలి కదా. ఇలాంటి రసాయనాలే, కొన్ని రకాల పురుగుమందులే.. ఏకంగా మనిషుల ప్రాణాలు తీస్తున్నాయి. మందు, సిగరెట్, గుట్కా అలవాట్లు లేకపోయినా క్యాన్సర్‌ ఎందుకొస్తోందంటే.. ఒకానొక కారణం తింటున్న ఆహారమే. ఆ ఆహార ఉత్పత్తికి వాడుతున్న పురుగుమందులే. తినడం తరువాత.. పెస్టిసైడ్స్ చల్లుతున్న కారణంగానే ఏడాదికి 11వేల మంది రైతులు చనిపోతున్నారు. ఇక.. పురుగుమందులు చల్లిన ఆహారాన్ని తిని చనిపోతున్న వాళ్లు.. ఏటా లక్షల్లోనే ఉన్నారు. సో, మనమెవరం అన్నం తినడం లేదు.. రసాయనాన్నం తింటున్నాం. అది ఎంత చేటు చేస్తోందో, ఎలా ప్రాణం తీస్తోందో డిటైల్డ్‌గా తెలుసుకుందాం..! ఓ రెండేళ్ల క్రితం జరిగిన...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి