పెళ్లై రెండు నెలలు కూడా నిండకుండానే అత్తింటి వారి ఘాతుకం.. నవ వధువు అనుమానాస్పద మృతి

కాళ్ల పారాణి కూడా ఆరక ముందే నవ వధువును కడతేర్చాడో పతి దేవుడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. వరకట్నం కోసమే కట్టుకున్నవాడు, మెట్టినింటి వారు వేధించి తమ బిడ్డను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషాద ఘటన కర్ణాటక ధర్వాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెళ్లై రెండు నెలలు కూడా నిండకుండానే అత్తింటి వారి ఘాతుకం.. నవ వధువు అనుమానాస్పద మృతి
Karnataka Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 24, 2023 | 12:58 PM

కాళ్ల పారాణి కూడా ఆరక ముందే నవ వధువును కడతేర్చాడో పతి దేవుడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. వరకట్నం కోసమే కట్టుకున్నవాడు, మెట్టినింటి వారు వేధించి తమ బిడ్డను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషాద ఘటన కర్ణాటక ధర్వాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటక ధర్వాడ జిల్లా అనేరికి గ్రామానికి చెందిన షహబాద్ ములగంజ (26)కు గదగ్ జిల్లా గజేంద్రడకు చెందిన షహనాజ్ బేగం (24)తో నెలన్నర కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు తరపువారు వరుడికి కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. సకల లాంచనాలతో కూతురిని అత్తారింటికి సాగనంపారు కూడా. వివాహానంతరం ములగంజ, షహనాజ్‌ బేగం దంపతుల కాపురం కొన్ని రోజుల పాటు సజావుగానే సాగింది. క్రమక్రమంగా ములగంజ అసలు స్వరూపం బయటపడసాగింది. అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ములగంజ తల్లిదండ్రులు కూడా కొడుకుకి వత్తాసు పలికి షహనాజ్ బేగంను చిత్రహింసలకు గురిచేసేవారు. దీంతో ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆ యువతికి కన్నీటి కడగండ్లే మిగిలాయి. ఈ క్రమంలో రంజాన్ పండగ వేళ అందరూ హడావిడిగా ఉన్న సమయంలో షహనాజ్ బేగం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని భర్త ములగంజ భార్య షహనాజ్ బేగం తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

షహనాజ్ బేగం మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. అనంతరం మృతురాలి భర్త, అత్తమామలపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం పేరుతో తమ కూతురిని హింసించి, హత్య చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.