లోపం చిన్నదే.. కానీ నష్టం మాత్రం పెద్దది.. PSLV ప్రయోగం వైఫల్యం వెనుక అసలు కారణం ఇదేనా..
ఏడు నిమిషాల్లో ప్రయోగం పూర్తయి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని ఇస్రో భావిస్తున్న క్షణాలవి.. ఒకసారిగా మూడో దశ దాటిన తర్వాత నిర్దేశిత మార్గంలో కాకుండా ఒక్కసారిగా కిందకు జార విడిచినట్టు రాకెట్ గమనం మారిపోయింది. రెండు నిమిషాల పాటు ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రాకెట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరిగినా..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నందు ఈనెల 18వ తేదీ ఉదయం 5.59 నిమిషాలకు షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించిన పిఎస్ఎల్వి సి 61 రాకెట్ ప్రయోగం జరిగింది. మొత్తం నాలుగు దశల్లో జరిగే బిఎస్ఎల్వి ప్రయోగం మూడు దశలు విజయవంతంగా కొనసాగింది. ఏడు నిమిషాల్లో ప్రయోగం పూర్తయి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని ఇస్రో భావిస్తున్న క్షణాలవి.. ఒకసారిగా మూడో దశ దాటిన తర్వాత నిర్దేశిత మార్గంలో కాకుండా ఒక్కసారిగా కిందకు జార విడిచినట్టు రాకెట్ గమనం మారిపోయింది. రెండు నిమిషాల పాటు ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రాకెట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరిగినా.. ఒకసారిగా నింగిలోకి వెళ్ళిన తర్వాత రాకెట్ గమనం దాని ట్రాకింగ్ మొత్తం కేరళలోని తిరువనంతపురం గ్రౌండ్ స్టేషన్ నుంచి జరుగుతుంది. రౌండ్స్టేషన్లోని శాస్త్రవేత్తలతో మాట్లాడిన శ్రీహరికోటలోని విశ్వశాస్త్రవేత్తలకు అప్పుడే అసలు విషయం అర్థమైంది. అసంపూర్తిగా మిగిలిపోయింది.
అసలు ప్రయోగం ఎందుకు విఫలమైంది.. పూర్తిగా విశ్లేషించుకుని మిగిలిన విషయాలు తర్వాత అప్డేట్ చేస్తామని విశ్వ చైర్మన్ నారాయణ మీడియాకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.. తర్వాత పిఎస్ఎల్వి రాకెట్ వైఫల్యం పై ఇస్రో చైర్మన్ నారాయణన్ తో పాటు శాస్త్రవేత్తలు అందరూ విశ్లేషణ పనుల్లో నిమగ్నమయ్యారు. పిఎస్ఎల్వి సి 61 రాకెట్ ఫెయిల్యూర్ అనాలసిస్ కమిటీలును రెండుగా ఏర్పాటు చేసి ఈ కమిటీల ద్వారా ఈ రాకెట్ ప్రయోగం లోపం ఎక్కడ జరిగిందన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ రాకెట్ ప్రయోగం మొత్తం నాలుగు దశలతో తయారు చేయడం జరిగింది.
అయితే ఈ రాకెట్ ప్రయోగ సమయంలో మూడవ దశలో గమనం తప్పింది. అక్కడ నుండి రాడార్ సిస్టం శాస్త్రవేత్తలు కు రాకెట్ గమనాన్ని అందించలేదు. దీంతో ఇస్రో చైర్మన్ నారాయణన్ పిఎస్ఎల్వీ సి 61 రాకెట్ ప్రయోగంలో కొంత సాంకేతిక లోపం తలెత్తినది అని మిగతా సమాచారాన్ని ఎప్పుడు తెలుపుతామని కూడా ఆయన వెల్లడించలేదు. ఈ ప్రయోగం వైఫల్యం తర్వాత శ్రీహరికోటతో పాటు ఇస్రోలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి .ముఖ్యంగా పిఎస్ఎల్వీ c61 రాకెట్ నిర్మాణంలో అత్యధిక భాగం శ్రీహరికోట శాస్త్రవేత్తలు పాలుపంచుకోవడం, శ్రీహరికోట శాస్త్రవేత్తలు పాలుపంచుకున్న ఘన ఇంధనం విభాగంలోనే సాంకేతిక లోపం జరగడం ఈ రాకెట్ ప్రయోగం ప్రధాన కారణం.ఈ pslv. c61 ఫెయిల్యూర్ కావడంతో పాటు అందులో ప్రయోగించాల్సిన అత్యంత విలువైనఖరీదైన ఉపగ్రహం ఈవోఎస్ 09 కూడా వృధా కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో తీవ్ర నిర్వేదం చోటు చేసుకుంది..
450 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన రాకెట్ 259 కిలోమీటర్ల దూరం వరకు అంతరిక్ష కక్షలోకి వెళ్లిన ఈ రాకెట్ లోని మూడవ దశలో ఘన ఇంధన మోటారు వైఫల్యం కావడం తో నాలుగవ దశ లో ఉపగ్రహాన్ని నిర్మూలించినట్లు కూడా ఇస్రో వెల్లడించలేదు .అయితే ఇస్రో అధికారికంగా ఇప్పటివరకు ఈ రాకెట్ వైఫల్యం మీద వివరణ కూడా ఇవ్వలేదు. ఈ రాకెట్ నిర్మాణంలో ముఖ్యంగా రెండు ఘన ఇంధన దశలు కలిగి ఉంటుంది .ఈ ఘన ఇంధన మోటారు షార్ లో తయారు కాగా, మిగిలిన రెండు ద్రవ ఇంధన మోటారులు తమిళనాడులోని మహేంద్రగిరిలో తయారు చేయడం జరిగింది. ఏదిఏమైనా ప్రస్తుతం ఇస్రో 101 వ రాకెట్ ప్రయోగం వైఫల్యం తర్వాత దానికి సంబంధించిన కారణాలను కలుసుకునే ప్రయత్నంలో దిశలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ రెండు కమిటీలను ఏర్పాటు చేసి వైఫల్యంపై విశ్లేషణ వేగవంతం చేశారు .
రాకెట్ వేగం అది, వెళ్లిన ఎత్తు అందులోని ఇంజన్లు పనితీరు సంబంధిత అంశాలపై ఈ రెండు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. మూడవ దశ మోటార్లు ఇంధన ప్రవాహం గురించి అదే విధంగా నాజిల్ సమస్యల గురించి ముఖ్యంగా రాకెట్ ఫెయిల్యూర్ సమయాన ఒక దశ నుంచి మరొక దశకు మోటార్లుకు సంబంధించిన ఇంధనం మండుకోవడం వంటి చర్యల్లో ఏమైనా లోపం జరిగిందా అనే కోణంలో కూడా ఈ విశ్లేషణ బృందాలు ఆరా తీస్తున్నారు.
అంతేకాకుండా శ్రీహరికోటలోని ఘనఇంధన తయారీ కేంద్రంలో తయారైన ఘన ఇంధన మోటారు డిజైన్ తయారీలో ఏమైనా లోపాలు జరిగాయా లేదా దానికి సంబంధించిన నాజిల్ నియంత్రణ వ్యవస్థలో మూడవ దశ లోపల ఉన్న పరికరాలు ఏమైనా సరిగ్గా పనిచేయలేదా అన్న దాని మీద కూడా ఈ రెండు బృందాలు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద అలవోకగా తారాజువ్వలాగా పదేపదే ప్రయోగించిన పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం కీలక సమయంలో మొరాయించడం కొన్ని ప్రశ్నలకు ఇస్రో శాస్త్రవేత్తల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








