వార్నీ.. ఇదేక్కడి విడ్డూరం.. వడగళ్ల వానకు విమానం ధ్వంసం.. ఎక్కడంటే..
వర్షాల తీవ్రత కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో వాహనదారులకు కష్టంగా మారింది. రైళ్ల రాకపోకలపై కూడా వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. పలుచోట్ల ట్రైన్లు ఆలస్యంగా నడవడమే కాకుండా, కొన్నిచోట్ల రద్దు అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో విమానయాన సంస్థలూ అప్రమత్తమయ్యాయి.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. వడగళ్ల వర్షం కారణంగా ఇండిగో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. విమానంలో 200 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వడగళ్ల వర్షం దెబ్బకు విమానం ముందు భాగం ధ్వంసమైంది.
వీడియో ఇక్కడ చూడండి..
వర్షాల తీవ్రత కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో వాహనదారులకు కష్టంగా మారింది. రైళ్ల రాకపోకలపై కూడా వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. పలుచోట్ల ట్రైన్లు ఆలస్యంగా నడవడమే కాకుండా, కొన్నిచోట్ల రద్దు అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో విమానయాన సంస్థలూ అప్రమత్తమయ్యాయి.ప్రత్యేకించి ఇండిగో సంస్థ ఒక హెచ్చరిక విడుదల చేస్తూ,వర్షాల ప్రభావంతో కొన్ని విమానాల షెడ్యూల్‌లో ఆలస్యం ఉండే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




