CM Nitish Kumar: మహాకూటమికి షాక్ ఇచ్చిన సీఎం నితీష్ కుమార్ అసలు వ్యూహం ఏంటి..?

మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్‌. బిహార్‌లో ఎక్కువ కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా కూడా నితీష్‌ కుమార్‌ రికార్డు సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి బీజేపీ.. మరోసారి కాంగ్రెస్ కూటమి.. ఇలా 2013 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఎన్డీయేలో చేరిన నితీష్ కుమార్‌.. మళ్లీ ఇప్పుడు అదే కూటమికి దగ్గరవుతున్నారు.

CM Nitish Kumar: మహాకూటమికి షాక్ ఇచ్చిన సీఎం నితీష్ కుమార్ అసలు వ్యూహం ఏంటి..?
Nitish Kumar
Follow us
Srikar T

|

Updated on: Jan 27, 2024 | 10:30 AM

మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్‌. బిహార్‌లో ఎక్కువ కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా కూడా నితీష్‌ కుమార్‌ రికార్డు సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి బీజేపీ.. మరోసారి కాంగ్రెస్ కూటమి.. ఇలా 2013 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఎన్డీయేలో చేరిన నితీష్ కుమార్‌.. మళ్లీ ఇప్పుడు అదే కూటమికి దగ్గరవుతున్నారు. 2014లో నితీష్ కుమార్ బీజేపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపారు. ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. దీంతో నితీష్ మళ్లీ సీఎం కుర్చీ దక్కించుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ను డిప్యూటీ సీఎంను చేశారు.

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 2017లో నితీశ్ కుమార్ మహాకూటమికి షాక్‌ ఇచ్చారు. ఐఆర్‌సీటీసీ స్కాంలో డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవికి నితీష్‌ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఎన్డీయేలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి విజయం సాధించడంతో మళ్లీ సీఎం సీటు నితీష్‌ కుమార్‌కే దక్కింది. రెండేళ్ల తర్వాత బీజేపీతో సమస్యలు మొదలు కాగానే 2022లో నితీశ్ కుమార్ మరోసారి సీఎం పదవికి రాజీనామా చేశారు. గంటల వ్యవధిలోనే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తేజశ్విని మళ్లీ డిప్యూటీ సీఎంను చేశారు. ఇలా కూటమిని ఎప్పుడంటే అప్పుడే మార్చి.. ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోయే లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు నితీష్‌ కుమార్‌. పొత్తు ఎవరితో ఉన్నా.. ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవిని మాత్రం దక్కించుకుంటున్నారు నితీష్‌ కుమార్‌. ఈసారి కూడా అదే బాటలో నడుస్తారా.. లేదా.. కొత్త ట్విస్ట్‌ ఏమైనా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..