Macron Gift: భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ బంపర్‌ ఆఫర్‌.! 30 వేల మందికి ఆహ్వానం పలికిన మెక్రాన్‌.

Macron Gift: భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ బంపర్‌ ఆఫర్‌.! 30 వేల మందికి ఆహ్వానం పలికిన మెక్రాన్‌.

|

Updated on: Jan 26, 2024 | 7:27 PM

భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఏ విధంగా మద్దతు అందించనుందో మెక్రాన్‌ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఏ విధంగా మద్దతు అందించనుందో మెక్రాన్‌ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని వివరించారు. ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం మెక్రాన్‌ ప్రత్యేక విమానంలో గురువారం జైపూర్‌ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం డిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి అశ్వరథంలో కూర్చొని సభాస్థలికి వచ్చారు. అనంతరం పెరేడ్ తలకించారు. అంతకు ముందు గురువారం జైపూర్‌ శివారులోని ఆమెర్‌ కోటను మెక్రాన్‌ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు హస్తకళల దుకాణంలో అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. నేతలిద్దరూ సాహూ చాయ్‌వాలా వద్ద మసాలా టీ సేవిస్తూ కబుర్లు చెప్పుకొన్నారు. తర్వాత ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి