AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab CM: రిపబ్లిక్ డే ఈవెంట్‌లో భార్య గర్భం గురించి ‘శుభవార్త’ చెప్పిన పంజాబ్ ముఖ్యమంత్రి..

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తండ్రి కాబోతున్నారు. ఈ సమాచారాన్ని ఆయన స్వయంగా ప్రజలతో పంచుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భగవంత్ మాన్ మాట్లాడుతూ, నేను వ్యక్తిగత ప్రకటన చేయాలనుకుంటున్నాను. మార్చి నెలలో నా ఇంటికి కూడా సంతోషం రాబోతోంది. అంటూ చెప్పుకొచ్చారు.

Punjab CM: రిపబ్లిక్ డే ఈవెంట్‌లో భార్య గర్భం గురించి 'శుభవార్త' చెప్పిన పంజాబ్ ముఖ్యమంత్రి..
Punjab Cm Bhagwant Mann
Balaraju Goud
|

Updated on: Jan 26, 2024 | 7:08 PM

Share

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తండ్రి కాబోతున్నారు. ఈ సమాచారాన్ని ఆయన స్వయంగా ప్రజలతో పంచుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భగవంత్ మాన్ మాట్లాడుతూ, నేను వ్యక్తిగత ప్రకటన చేయాలనుకుంటున్నాను. మార్చి నెలలో నా ఇంటికి కూడా సంతోషం రాబోతోంది. నా భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ 7వ నెల గర్భవతి. అయితే అది మగపిల్లా, ఆడపిల్లా అనేది ఇప్పటికీ మాకు తెలియదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పిల్లల లింగ నిర్ధారణకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఎవరు వచ్చినా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

ఆరోగ్యం ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద వరం అని సీఎం మాన్ స్పష్టం చేశారు. అబ్బాయి – అమ్మాయిని సరి సమానంగా ప్రేమించాలన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడాలు వద్దని విజ్ఞప్తి చేశారు. మహిళా శక్తి పట్ల పంజాబ్ ప్రభుత్వ సంకల్పం చాలా కాలం పాటు కొనసాగుతుందని తెలిపారు. “దేవుని ఆశీర్వాదం ఏ రూపంలో వస్తుందో మాకు తెలియదు,” అన్నారాయన. ఆడపిల్లల భ్రూణహత్యలకు, లింగాన్ని కనుగొనే ప్రక్రియ, ఆడపిల్ల అయితే అబార్షన్ చేయడాన్ని వ్యతిరేకించాలన్నారు. కాగా, డాక్టర్ గురుప్రీత్ జూలై 2022లో సీఎం భగవంత్ మాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె మాన్‌కి రెండవ భార్య. ఒక సామాజిక సమస్యపై అవగాహన కల్పించేందుకు ఈ వార్తను బహిరంగపరుస్తున్నట్లు మాన్ తెలిపారు.

అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ సిఎం భగవంత్ మాన్ లూథియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాగణంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎం పరేడ్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాన్‌ మాట్లాడుతూ పంజాబ్‌ వల్లనే గణతంత్ర దినోత్సవం వచ్చిందన్నారు. పోరాటాలు చేసి బలిదానం చేసి, గణతంత్ర దినోత్సవం వచ్చింది. అందుకే గణతంత్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..