Maldives – India: భారత్‌తో వివాదం మనకే ప్రమాదం.. మాల్దీవుల అధ్యక్షుడికి ప్రతిపక్షాల హెచ్చరిక!
చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్‌తో వివాదానికి తెరతీసిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు సొంత దేశంలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ వివాదం మాల్దీవుల అభివృద్ధినే దెబ్బతీస్తుందంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆయన్ను హెచ్చరించాయి. చైనాకు చెందిన పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన సమయంలో ప్రతిపక్షాల నుంచి హెచ్చరిక రావడం గమనార్హం.
చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్‌తో వివాదానికి తెరతీసిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు సొంత దేశంలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ వివాదం మాల్దీవుల అభివృద్ధినే దెబ్బతీస్తుందంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆయన్ను హెచ్చరించాయి. చైనాకు చెందిన పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన సమయంలో ప్రతిపక్షాల నుంచి హెచ్చరిక రావడం గమనార్హం. మాల్దీవుల అభివృద్ధిలో సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్న మిత్రులను దూరం చేసుకోవడం దేశానికే హానికరం అంటూ ‘మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ ది డెమొక్రాట్స్ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. భారత్‌ను దీర్ఘకాల మిత్రుడిగా అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాయి. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పనిచేయాలంటూ మారుతున్న ‘విదేశాంగ విధాన వైఖరి’ని ఎత్తిచూపాయి. మార్చి 15 కల్లా తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఇటీవల తుది గడువు విధించటంతో వివాదం మొదలైంది. భారత సేన వెనక్కి తిరిగి వస్తే.. ఆ స్థానంలో చైనా దళాలు ప్రవేశించే అవకాశం ఉంది. లక్షద్వీప్‌లో భారత ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడంతో వివాదం ముదిరింది. చైనా పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించడంపైనా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos