Nitrogen Gas: నైట్రోజన్‌ గ్యాస్‌తో తొలి మరణ శిక్ష.! ఓ మతాధికారి భార్య హత్య కేసులో దోషికి అమలు.

Nitrogen Gas: నైట్రోజన్‌ గ్యాస్‌తో తొలి మరణ శిక్ష.! ఓ మతాధికారి భార్య హత్య కేసులో దోషికి అమలు.

|

Updated on: Jan 26, 2024 | 7:36 PM

అమెరికాలోని అలబామాలో తాజాగా ఓ ఖైదీకి నైట్రోజన్‌ గ్యాస్‌ ఇచ్చి మరణ శిక్ష అమలు చేశారు. 35 ఏళ్ల క్రితం ఓ మతాధికారి భార్య ఎలిజబెత్‌ సెనెట్‌ను హత్య చేసిన కేసులో కెన్నెత్ స్మిత్‌కు దీనిని అమలు చేశారు. మరణశిక్షకు ముందు స్మిత్‌కు అధికారులు మాస్కును బిగించారు. దాని నుంచి నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపించడం మొదలుపెట్టారు. దాదాపు ఏడు నిమిషాల్లో అతడికి శిక్ష అమలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అతడి మరణాన్ని అలబామా గవర్నర్‌ ధ్రువీకరించారు.

అమెరికాలోని అలబామాలో తాజాగా ఓ ఖైదీకి నైట్రోజన్‌ గ్యాస్‌ ఇచ్చి మరణ శిక్ష అమలు చేశారు. 35 ఏళ్ల క్రితం ఓ మతాధికారి భార్య ఎలిజబెత్‌ సెనెట్‌ను హత్య చేసిన కేసులో కెన్నెత్ స్మిత్‌కు దీనిని అమలు చేశారు. మరణశిక్షకు ముందు స్మిత్‌కు అధికారులు మాస్కును బిగించారు. దాని నుంచి నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపించడం మొదలుపెట్టారు. దాదాపు ఏడు నిమిషాల్లో అతడికి శిక్ష అమలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అతడి మరణాన్ని అలబామా గవర్నర్‌ ధ్రువీకరించారు. అలబామాలోని కొల్బెర్ట్‌ కౌంటీలో ఛార్లెస్‌ సెనెట్‌ అనే పాస్టర్‌ భారీగా అప్పులు చేశాడు. భార్య ఎలిజబెత్‌ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్మును దక్కించుకోవచ్చని భావించాడు. ఆమెను చంపేందుకు గ్రే విలియమ్స్‌ అనే వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చాడు. 1,000 డాలర్ల చొప్పున సుపారీ ఇచ్చి.. కెన్నెత్ స్మిత్‌కు అలాగే మరో వ్యక్తి జాన్‌ ఫ్రాస్ట్‌ పార్కర్‌ను కూడా పురమాయించాడు. 1988 మార్చిలో ఎలిజబెత్‌ను వీరు హత్య చేశారు.

ఈ కేసులో పోలీసులు భర్త ఛార్లెస్‌ను విచారించగా నేరం అంగీకరించి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం తర్వాత దంపతుల మృతదేహాలను ఒకే చోట సమాధి చేశారు. ఎలిజబెత్‌ను చంపాలని కాంట్రాక్ట్‌ ఇచ్చిన గ్రే విలియమ్స్‌కు జీవితఖైదు విధించగా అతడు జైల్లోనే మరణించాడు. కిరాయి హంతకుల్లో ఒకడైన జాన్‌ ప్రాస్ట్‌కు 2010లో మరణశిక్షను అమలు చేశారు. మరో నిందితుడు స్మిత్‌ మాత్రం తాను దాడిలో పాల్గొనలేదని వాదిస్తూ న్యాయ పోరాటం చేశాడు. కానీ, చివరకు దోషిగా తేలాడు. 2022లో విషపూరిత ఇంజెక్షన్‌ ఇచ్చి అతడికి మరణశిక్షను అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది. కానీ, అలాంటి ఇంజెక్షన్‌ను సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టింది. ఈ లోపు డెత్‌ వారెంట్‌ ముగిసిపోయింది. దీంతో గతంలో ఎన్నడూ పరీక్షించని మరణశిక్ష విధానాన్ని ఇతడిపై ప్రయోగించాలని న్యాయమూర్తి సూచించారు. ఇందుకు స్వచ్ఛమైన నైట్రోజన్‌ గ్యాస్‌ను ఎంచుకుని తాజాగా శిక్షను అమలు చేశారు. ‘డెత్‌ పెనాల్టీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌’ ప్రకారం ప్రపంచంలో స్వచ్ఛమైన నైట్రోజన్‌ గ్యాస్‌ను వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ తతంగం మొత్తం ప్రత్యక్షంగా వీక్షించడానికి ఐదుగురు మీడియా సభ్యులను అట్మోర్‌లోని హోల్మన్‌ కరెక్షన్‌ ఫెసిలిటీకి తీసుకెళ్లారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?