Husband Harassment: వీడేం భర్త.. భార్య లావుగా అయ్యిందని వదిలేసిన భర్త.!
భార్య లావుగా అయ్యిందని ఆమెను వదిలేశాడు భర్త. 20 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు కూడా పుట్టారు. అందులో ఇద్దరు చనిపోయారు. పెద్ద కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఇరవై సంవత్సరాలు కాపురం చేశాక ఇప్పుడు లావుగా అయ్యావంటూ.. అవసరం లేదు వెళ్ళిపోమంటూ రోడ్డుపై వదిలేశాడు ఆ శాడిస్టు భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
భార్య లావుగా అయ్యిందని ఆమెను వదిలేశాడు భర్త. 20 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు కూడా పుట్టారు. అందులో ఇద్దరు చనిపోయారు. పెద్ద కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఇరవై సంవత్సరాలు కాపురం చేశాక ఇప్పుడు లావుగా అయ్యావంటూ.. అవసరం లేదు వెళ్ళిపోమంటూ రోడ్డుపై వదిలేశాడు ఆ శాడిస్టు భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతయ్య కాలనీలో నివాసం ఉండే నాగమణి, అంతోని లాజరస్‌లు 2002 సంవత్సరంలో ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు సంతానం కూడా కలిగింది. అయితే తాజాగా ఆ ఇల్లాలికి భర్త నుంచి విచిత్రమైన వేధింపులు మొదలయ్యాయి. తన భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను ఇంట్లో నుండి కొట్టి వెళ్లగొట్టాడని ఆమె ఆరోపిస్తోంది. దాదాపు సంవత్సర కాలం నుండి తనను ఇంటికి రానివ్వడంలేదని… ఇంటికి వెళ్తే కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన పిల్లలను సైతం తన దగ్గరకు రానివ్వడం లేదని… తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని గోడు వెళ్ళబోసుకుంది. దీనిపై స్పందించిన పోలీసులు ఏడాది క్రితమే కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోందని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి

