Rahul Gandhi: రాహుల్ ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుంచే.. అధికారిక ప్రకటన..
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. అసోంలో యాత్ర ముగించుకుని పశ్చిమ బెంగాల్ లో అడుగుపెట్టారు రాహుల్. ఈ సందర్భంగా వాయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ ఎంపీ కే. మురళీధరన్ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. అసోంలో యాత్ర ముగించుకుని పశ్చిమ బెంగాల్ లో అడుగుపెట్టారు రాహుల్. ఈ సందర్భంగా వాయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ ఎంపీ కే. మురళీధరన్ ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు. కేరళ సిట్టింగ్ ఎంపీలందరూ కన్నూర్ మినహా మిగిలిన ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారన్నారు. ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.
ఇక గతంలో జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లోను రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలోనే మురళీధరన్ ఇండియా కూటమి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మొన్న మమతా, నిన్న నితీష్ కూటమికి రాజీనామా చేయడంపై స్పందించారు. ఇండియా కూటమిలో ఎలాంటి సమస్యలు లేవన్నారు. రాష్ట్రాల పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కేంద్రం విషయం వచ్చే సరికి అందరూ బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తారన్నారు. బిహార్ ముఖ్యమంత్రి ఇండియా కూటమిలో ఉండటం, బయటకు వెళ్లడం అతని అభిప్రాయమన్నారు. తాము ఆయన్ను బయటకు పంపించమన్నారు. అలాగే మమతా బెనర్జీ విషయంలో కూడా సీట్ల సర్థుబాటు ఇంకా జరగలేదని, చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
కేరళ, పంజాబ్ వంటి ప్రాంతాల్లో కూటమి సభ్యుల మధ్య పోటీ ఉంటుందన్నారు. అయితే ఈ ఓట్లు చీలిపోవడం వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముందుగా షెడ్యూల్ చేసిన దాని ప్రకారం జనవరి 26,27 తేదీల్లో విరామం తీసుకున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఢిల్లీలో గడిపారు రాహుల్. 28 నుంచి షెడ్యూల్ ప్రకారం కుచ్ బెహార్ మీదుగా యాత్ర సాగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..