Bihar Politics: అధికార మహా కూటమితో జేడీయూ తెగదెంపులు.. పాట్నాలో ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో తేజశ్వి భేటీ

లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. మిత్రపక్షాల మధ్య వివాదంతో బీహార్‌ పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ వేగంగా మారిపోతున్నాయి. సీఎం నితీష్‌కుమార్‌ మరోసారి ఎన్డీఏ గూటికి చేరేందుకు అడుగులు వేస్తుండగా, అటు ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తుండడం ఆసక్తిగా మారుతోంది. అటు నితీష్‌ నిర్ణయం ప్రతిపక్ష ఇండియా కూటమిని కూడా కుదిపేస్తోంది.

Bihar Politics: అధికార మహా కూటమితో జేడీయూ తెగదెంపులు.. పాట్నాలో ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో తేజశ్వి భేటీ
Bihar Politics
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 26, 2024 | 8:49 PM

లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. మిత్రపక్షాల మధ్య వివాదంతో బీహార్‌ పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ వేగంగా మారిపోతున్నాయి. సీఎం నితీష్‌కుమార్‌ మరోసారి ఎన్డీఏ గూటికి చేరేందుకు అడుగులు వేస్తుండగా, అటు ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తుండడం ఆసక్తిగా మారుతోంది. అటు నితీష్‌ నిర్ణయం ప్రతిపక్ష ఇండియా కూటమిని కూడా కుదిపేస్తోంది.

బీహార్ రాజకీయాల్లో తలెత్తిన అనిశ్చితికి మరికొద్ది గంటల్లోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార మహాకూటమితో నితీష్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ తెగదెంపులు చేసుకుని బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ సీఎం నితీష్‌కుమార్ ముందస్తు షెడ్యూల్స్ రద్దు చేసుకుని పాట్నాలోనే ఉండిపోవడం, రాజ్‌భవన్ ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అటు.. ఎట్‌హోం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం తేజశ్వియాదవ్‌ హాజరుకాకపోవడంతో ఆయనకు కేటాయించిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ పరిణామాలు బీహార్‌ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ప్రస్తుత పరిస్థితులతో మరో రెండు రోజుల్లో నితీష్‌కుమార్‌ ఎన్డీయే గూటికి చేరి.. బీజేపీ- జేడీయూ కూటమి సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమనిపిస్తోంది. దాంతో.. బీహార్‌ రాజకీయ పరిణామాలన్నీ శరవేగంగా మారుతున్నాయి. అందుకు తగ్గట్లే.. ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా, అమిత్‌షా నేతృత్వంలో బీజేపీ హైకమాండ్‌ కూడా కీలక సమావేశం నిర్వహించింది. బీహార్‌లోని తాజా పరిణామాలతోపాటు ప్రభుత్వ ఏర్పాటు, నితీష్‌కుమార్‌ ఎన్డీయే కూటమిలో చేరిక, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చించారు. బీహార్‌ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం లాంటి కీలక పోస్టులపైనా బీజేపీ- జేడీయూ నేతలు కసరత్తు చేస్తున్నారు. అటు ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్‌ కూడా తగ్గేదేలే అంటున్నారు. ఆయన కూడా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో పాట్నాలో సమావేశయ్యారు.

ఇక.. అసలు బీహార్‌లో మొత్తం ఎన్ని సీట్లు? ఎవరి బలం ఎంతో ఒకసారి పరిశీలిస్తే, బీహార్‌లో మొత్తం 243 సీట్లు కాగా, 122 మ్యాజిక్‌ ఫిగర్‌. దాంతో 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయోచ్చు. ఈ లెక్కన బీజేపీకి 78మంది, నితీష్‌కుమార్‌ జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే.. ఇండిపెండెంట్లు కూడా బీజేపీ- జేడీయూ కూటమికే సపోర్ట్‌ చేస్తుండడంతో నితీష్‌ అండ్‌ కో బలం 125కి చేరుతోంది. దాంతో బీజేపీ- జేడీయూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమే. కానీ, నితీష్‌కుమార్‌ రాజీనామా చేయనున్న నేపథ్యంలో 79 ఎమ్మెల్యేలతో ఆర్జేడీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా మారనుంది. ఫలితంగా తమకు కూడా బలం ఉందంటూ తేజశ్వి యాదవ్‌ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం తేజశ్వి కసరత్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, నితీష్‌కుమార్‌ ఎపిసోడ్‌ కేంద్రంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమికే ఎసరు పెడుతోంది. ఎందుకంటే, ఇండియా కూటమిలో నితీష్‌కుమార్‌ బలమైన నేతగా ఉన్నారు. ఒకానొక దశలో ఇండియా కూటమి కన్వీనర్‌గా ప్రపోజల్‌ పెడితే ఆయనే తిరస్కరించారు. నిజానికి.. విపక్ష కూటమిలో ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో నితీష్‌కుమార్‌దే కీలక పాత్ర పోషించారు. పాట్నాలో నితీష్‌ నిర్వహించిన తొలి విపక్షాల సమావేశం ద్వారానే భారీ ప్రతిపక్ష కూటమి సాధ్యమైంది. దానిని కాంగ్రెస్‌ హైజాక్‌ చేసినప్పటికీ, తొలి విపక్ష కూటమి ప్రయత్నం చేసింది మాత్రం నితీష్‌కుమారే. అలాంటి వ్యక్తి అలియన్స్‌ నుంచి బయటకొచ్చేందుకు సిద్ధమవడంతో ఇండియా కూటమికి ఎసరొస్తుంది. మొత్తంగా.. అటు బీజేపీ- జేడీయూ కూటమి ప్రయత్నాలు, ఇటు.. ఆర్జేడీ కసరత్తులతో బీహార్‌ రాజకీయాలు ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయి. నితీష్‌ స్ట్రాటజీతో ఇండియా కూటమిలోనూ కల్లోలం రేగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్