మహిళతో షూ లేస్ కట్టించుకున్న ఆఫీసర్.. సస్పెండ్ చేస్తూ సీఎం ఆదేశాలు..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లా మెజిస్ట్రేట్ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. సింగ్రౌలీ జిల్లాలో ఒక మహిళ చేత తన కాలి షూ లేస్ కట్టించుకున్న సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తక్షణమే విధుల నుంచి తొలగించాలని సీఎం ఆదేశించారు. తమ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత గౌరవం ఇవ్వడమే ప్రధానమని తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లా మెజిస్ట్రేట్ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. సింగ్రౌలీ జిల్లాలో ఒక మహిళ చేత తన కాలి షూ లేస్ కట్టించుకున్న సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తక్షణమే విధుల నుంచి తొలగించాలని సీఎం ఆదేశించారు. తమ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత గౌరవం ఇవ్వడమే ప్రధానమని తెలిపారు. ఈ ఘటనపై పలువురు ఉన్నతాధికారులను దర్యాప్తుకు ఆదేశించారు. ఈ విషయాన్ని గురువారం సీఎంవో ఎక్స్ ట్వట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. మహిళ చేత షూ లేస్ కట్టించుకోవడంపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం జనవరి 22న జరిగినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ ప్రభుత్వంలో స్త్రీల గౌరవం ప్రధానమని తక్షణమే మెజిస్ట్రేట్ ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
సబ్ డివిజనల్ అధికారి అశ్వన్ రామ్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. తాను కొద్ది రోజుల క్రితం గాయపడ్డానని చెప్పుకొచ్చారు. వంగడంలో సమస్య ఉందని తెలిపారు. అందుకే తన సిబ్బందిలో ఒకరు ఇలా షూలేస్ కట్టారని తెలియజేశారు. ఇది కేవలం సహాయంగా మాత్రమే పరిగణించాలని కోరారు. గత ఏడాది డిసెంబర్ లో మోకాలికి సర్జరీ అయినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి నడవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే షూ లేస్ కట్టుకునేందుకు తీవ్ర అవస్థలు పడేవాడినని తెలిపారు. అందుకే తన కార్యాలయ సిబ్బంది సాయం చేసేవారని వివరణ ఇచ్చారు. ఈ ఘటన అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు జరిగిందన్నారు. హనుమంతుని గుడిలో ప్రత్యేక పూజలు చేసేందుకు వెళ్లే క్రమంలో తన షూ వదిలి దర్శనం చేసుకునేందుకు వెళ్లానన్నారు. తిరిగి బయటకు వచ్చి షూ మాత్రమే ధరించి లేస్ కట్టుకోకుండా అలాగే వెళ్తున్న క్రమంలో తన ఆఫీసు సిబ్బంది నిర్మలా దేవి కనిపించి షూ లేస్ కట్టడంలో సాయం చేశారని చెప్పారు. అంతే తప్ప ఆమెను షూలేస్ కట్టమని ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..