AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: ఉత్తరకాశీ జగన్నాథ ఆలయ అభివృద్ధిపై ఫోకస్.. సీఎం ధామితో కేంద్రమంత్రి ప్రధాన్ కీలక చర్చలు..

Uttarakashi Jagannath Temple: ఉత్తరకాశీ శ్రీ జగన్నాథ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో చర్చలు జరిపారు.

Dharmendra Pradhan: ఉత్తరకాశీ జగన్నాథ ఆలయ అభివృద్ధిపై ఫోకస్.. సీఎం ధామితో కేంద్రమంత్రి ప్రధాన్ కీలక చర్చలు..
Uttarakashi Jagannath Temple
Shaik Madar Saheb
|

Updated on: Jul 10, 2023 | 9:09 PM

Share

Uttarakashi Jagannath Temple: ఉత్తరకాశీ శ్రీ జగన్నాథ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో చర్చలు జరిపారు. ఉత్తరాఖండ్‌లోని అందమైన గ్రామాల మధ్య సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయంలో మతపరమైన సంప్రదాయ ఆచారాలు సజావుగా నిర్వహించడంపై కూడా ధర్మేంద్ర ప్రధాన్, పుష్కర్ సింగ్ ధామి చర్చించారు. జగన్నాథుని దర్శనం కోసం తన కుటుంబ సమేతంగా ఒడిశా సందర్శించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామిని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆహ్వానించారు.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సాల్డ్ గ్రామంలోని పురాతన జగన్నాథ ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒడిశా నటీమణులు సబ్యసాచి, అర్చిత నుంచి ఈ ఆలయం గురించి తెలుసుకున్నానని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏడాది క్రితం ఒరిస్సాకు చెందిన జనార్ధన్ మోహపాత్ర అనే వ్యక్తి డెహ్రాడూన్ వెళ్లారు. ఆయన కూతురి అడ్మిషన్ అక్కడే జరగాల్సి ఉంది. ఈ సమయంలో అతను జగన్నాథ దేవాలయం కోసం వెతుకుతూ ఉత్తరకాశీలోని 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని సబ్యసాచి, అర్చితలకు చెప్పారు. వారు దాని గురించి ట్వీట్ చేయగా.. అది నా దృష్టిని ఆకర్షించింది” అని ప్రధాన్ అన్నారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో సంభాషణ గురించి ట్వీట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. ఉత్తరకాశీలోని అందమైన పర్వతాలలో మహాప్రభు జగన్నాథ్ జీ ఆలయ వైభవాన్ని ప్రపంచానికి చాటడం కోసం ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో చర్చించినట్లు చెప్పారు. జగన్నాధుడి సంస్కృతిని పెంపొందించాలని, ఆలయాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేయాలని జగన్నాథ భక్తులందరి విజ్ఞప్తిని అంగీకరించినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

12వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు సాల్ద్ గ్రామంలో ఈ ఆలయాన్ని స్థాపించారని స్థానికులు భావిస్తున్నారు. ఈ పురాతన ఆలయం గురించిన సమాచారం మహాప్రభు జగన్నాథ్ సేవకుడు జనార్దన్ మహాపాత్ర పాతజోషి.. ప్రముఖ ఒడియా చిత్ర కళాకారుడు సబ్యసాచి.. అతని భార్య అర్చిత నుంచి వచ్చింది.

ఉత్తరకాశీలోని ఈ అద్భుతమైన జగన్నాథ ధామ్ ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’కి ఉదాహరణ అని అలాగే ఉత్తరాఖండ్ – ఒడిశాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..