Ayodhya Ram mandir: అయోధ్యలో వేగంగా దివ్య రామమందిర నిర్మాణం.. 80 శాతం పనులు పూర్తి..
అయోధ్యలో దివ్య రామమందిరం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రామమందిరం నిర్మాణం పనులు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి రామమందిరం భక్తులకు దర్శనమివ్వబోతోంది. టీవీ9 బృందం ఆలయ నిర్మాణం పనులను పరిశీలించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి అయోధ్య రాముడి దర్శనభాగ్యం

అయోధ్యలో దివ్య రామమందిరం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రామమందిరం నిర్మాణం పనులు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి రామమందిరం భక్తులకు దర్శనమివ్వబోతోంది. టీవీ9 బృందం ఆలయ నిర్మాణం పనులను పరిశీలించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి అయోధ్య రాముడి దర్శనభాగ్యం భక్తులకు కలగబోతోండుగా.. అనేక అద్భుత నిర్మాణాలు ఈ ఆలయంలో పొందుపరుస్తున్నారు.
ప్రతి స్తంభం మీద దేవతా మూర్తుల ప్రతిమలు..
అయోధ్య రామమందిరంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 24 మెట్లు ఎక్కితే ఆలయం ప్రాంగణం లోకి చేరుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. నడకమార్గంలో వచ్చే భక్తుల కోసమే కాకుండా దివ్యాంగుల కోసం ర్యాంప్‌ను కూడా నిర్మిస్తున్నారు. 24 మెట్లు ఎక్కిన తరువాత ప్లాట్‌ఫాంపై మనకు అయోధ్య రామమందిరం సింహద్వారం దర్శనమిస్తుంది. సింహద్వారం నిర్మాణం కూడా తుదిదశకు చేరుకుంది. నకాషీలు సింహద్వారంపై చెక్కే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సింహద్వారం దగ్గర ఉన్న స్తంభాలకు ఒక్కొక్కదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రతి స్తంభం మీద దేవతా మూర్తుల ప్రతిమలు దర్శనమిస్తాయి. రాళ్లను ఓ క్రమపద్దతిలో పేరుస్తూ ఆలయ నిర్మాణం పనులు జరగుతున్నాయి. 500 మంది సిబ్బంది 24 గంటల పాటు ఆలయ నిర్మాణం పనుల్లో ఉన్నారు.
మూడు దశల్లో రామాలయ నిర్మాణం..
రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాతితో ఆలయ నిర్మాణం సాగుతోంది. రెండున్నర ఎకరాల స్థలంలో మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. మూడు దశల్లో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ తొలిదశ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌లో పూర్తి అవుతుంది. రెండు దశ నిర్మాణం డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతుంది. మూడో దశ 2025 నాటికి పూర్తవుతుంది.




రామమందిరం అడుగడుగునా అధ్మాత్మికత శోభిల్లబోతోంది. ఆలయ రూఫ్‌ను కూడా ప్రత్యేకరీతిలో తీర్చిదిద్దుతున్నారు. మందిరం లోపలికి అడుగుపెట్టే ముందే భక్తులకు ఎంతో మానసిక ప్రశాంతత లభించే విధంగా ఆలయ పరిసరాలు కన్పిస్తాయి. అయెధ్య రామమందిరంలో ఉన్న చిత్రకళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ప్రస్తుత కాలంలో దేశంలో ఏ ఆలయంలో కూడా కూడా మనకు ఇలాంటి చిత్రకళ కన్పించదు. శిల్పులు ఎంతో శ్రమించి వాటిని చెక్కుతున్నారు.
గర్భగుడిలో మూడ అంతస్తులు..
భారతీయ సంస్కృతి , సాంప్రదాయం , అధ్యాత్మికత శోభిల్లే విధగా అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోంది. సింహద్వారం తరువాత ఆలయంలో మనకు ఐదు మండపాలు దర్శనమిస్తాయి. నృత్యమండపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతన్నారు. గర్భగుడి గురించి చాలా చెప్పుకోవాలి. భగవాన్ శ్రీరాముడికి హనుమంతుడంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. అందుకే గర్భగుడికి ఎదురుగా హనుమాన్ విగ్రహం ఉండేలా నిర్మిస్తున్నారు. గర్భగుడిని మూడు అంతస్తులు ఉండే విధంగా నిర్మిస్తున్నారు. గర్భగుడి మూడంతస్తుల నిర్మాణం ఏప్రిల్ 2024 వరకు పూర్తవుతుంది. భక్తుల దర్శనాలు ప్రారంభయ్యాక కూడా నిర్మాణం పనులు కొనసాగుతాయి.
గర్భగుడిలో మూడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. సూర్యోదయం వేళ తొలి కిరణం భగవాన్ శ్రీరాముడి విగ్రహంపై పడేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
