Ashwini Vaishnaw: ఫాక్స్‌కాన్.. వేదాంత.. రెండూ మేక్ ఇన్ ఇండియాకు కట్టుబడి ఉన్నాయి.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన..
Semiconductor Mission in India: తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్.. భారతీయ ప్రముఖ మల్టీనేషనల్ మైనింగ్ కంపెనీ వేదాంతతో $19.5 బిలియన్ల జాయింట్ వెంచర్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇది ఇండియా చిప్ మేకింగ్..

Semiconductor Mission in India: తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్.. భారతీయ ప్రముఖ మల్టీనేషనల్ మైనింగ్ కంపెనీ వేదాంతతో $19.5 బిలియన్ల జాయింట్ వెంచర్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇది ఇండియా చిప్ మేకింగ్.. సెమీకండక్టర్ లక్ష్యాలపై ప్రభావం చూపుతుందన్న ఊహగానాలు మొదలయ్యాయి. వేదాంతతో 19.5 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలని ఫాక్స్‌కాన్ తీసుకున్న నిర్ణయం భారతదేశ సెమీకండక్టర్ లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం చూపదని.. రెండు కంపెనీలు దేశంలోని ప్రధాన నినాదమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కట్టుబడి ఉన్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
గత ఏడాది ఫాక్స్‌కాన్, వేదాంతలు గుజరాత్‌లో సెమీకండక్టర్, డిస్‌ప్లే ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే, ఒప్పందం రద్దు నిర్ణయంపై ఫాక్స్‌కాన్ దాని వెనుక గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.




“వేదాంతతో జాయింట్ వెంచర్‌పై ముందుకు వెళ్లబోమని ఫాక్స్‌కాన్ నిర్ణయించింది. ఫాక్స్‌కాన్ ఇప్పుడు వేదాంత పూర్తి యాజమాన్యంలోని సంస్థ నుంచి ఫాక్స్‌కాన్ పేరును తొలగించడానికి కృషి చేస్తోంది” అని తైవాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నిర్ణయం అనంతరం.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.. భారతదేశ సెమీకండక్టర్ ఫ్యాబ్ లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. “ఫాక్స్‌కాన్ – వేదాంత రెండూ భారతదేశ సెమీకండక్టర్ మిషన్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కట్టుబడి ఉన్నాయి” అని వైష్ణవ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Both the companies Foxconn and Vedanta are committed to India’s semiconductor mission and Make in India program.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 10, 2023
ఎలక్ట్రానిక్స్ – ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “వేదాంతతో తన జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలని ఫాక్స్‌కాన్ తీసుకున్న నిర్ణయం భారతదేశ సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు.” అని ట్వీట్ చేశారు.
ఫాక్స్‌కాన్ – వేదాంత రెండూ భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాయని, ఉద్యోగాల కల్పన ఆర్థిక వృద్ధికి దోహదపడే విలువైన పెట్టుబడిదారులని చంద్రశేఖర్ అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు.
➡️This decision of Foxconn to withdraw from its JV wth Vedanta has no impact on India’s #Semiconductor Fab goals. None.
➡️Both Foxconn n Vedanta have significant investments in India and are valued investors who are creating jobs n growth.
➡️It was well known that both… https://t.co/0DQrwXeCIr
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) July 10, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..
