My India My Life Goals: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే.. రాజేష్ శుక్లా యూ ఆర్ గ్రేట్..
Rajesh Shukla Inspirational Story: పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే.. మన భవిష్యత్తు బాగుంటుంది.. లేకపోతే.. అందమైన ప్రకృతి ప్రపంచాన్ని నిర్మించలేం.. అందుకే భారత ప్రభుత్వం ప్రత్యేక పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
Rajesh Shukla Inspirational Story: పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే.. మన భవిష్యత్తు బాగుంటుంది.. లేకపోతే.. అందమైన ప్రకృతి ప్రపంచాన్ని నిర్మించలేం.. అందుకే భారత ప్రభుత్వం ప్రత్యేక పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ‘‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో.. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్’’ అనే నినాదంతో చేపట్టిన పర్యావరణ ఉద్యమానికి టీవీ9 నెట్‌వర్క్ భాగస్వామ్యంగా ఉంది. ఈ ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఆదర్శ వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం.. గంగానది పరిరక్షణ – ప్రక్షాళనకు పాటుపడుతున్న యూపీకి చెందిన వారణాసి పర్యావరణ కార్యకర్త రాజేష్ శుక్లా.. నదిలో వ్యర్థాలను పడేయొద్దంటూ అందర్ని కోరుతున్నారు. రాజేష్ శుక్లా పవిత్ర గంగా నదిలో వ్యర్థాలను ఏరివేసే ప్రక్రియను 9ఏళ్ల క్రితం ప్రారంభించారు.
క్లీన్ గంగా గురించి.. రాజేష్ శుక్లా ఏమన్నారంటే.. ”ఉదయమే లేచి ఐదింటికే స్కూటర్ పై బయలుదేరి పవిత్ర గంగానది తీరంలో వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేస్తాను. మా బృదంలో సభ్యులంతా కలిసి రోజూ గంగామాత తీరంలో మూడు గంటలు పనిచేస్తాం.. హారతి ఇస్తాం.. చెత్త వేయకండి అంటూ జనాన్ని జాగృతం చేస్తాం.. చెత్త ఏరివేయడం మా దినచర్యలో ఓ భాగమైపోయింది.”
”పాలిథిన్ వ్యర్థాలు, దుస్తులు, ఇతర సామాగ్రి గంగా నదిలో వెయ్యద్దని చెబుతాం. నదిని కలుషితం చేస్తాయని అలాంటి వ్యర్థాలను నదిలో పడెయ్యద్దని విజ్ఞప్తి చేస్తాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం.. అందరం కలిసి పర్యావణ పరిరక్షణ కోసం పోరాడాలి. అంతా కలిసి ఆ పని చేస్తే మన పర్యావరణం మెరుగుపడుతుంది. ఆరోగ్య భారతం ఆవిష్కృతమవుతుంది. ఆజాదీకా అమృత్ మహోత్సవం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

